Saturday, March 15, 2014

శ్రీ భవిష్య (కలికి) పూరాణము3




ఆ తరువాత యుద్దములో నింత మందిని వధించిన పాపము పోవుటకై కలికి మూర్తి చక్ర తీర్ధమున స్నాన మాడుటకు పోవును. వాలఖిల్యాదిమును లచ్చటికి వచ్చి, "కుంభ కర్ణుని మనుమరాలొక తెయున్నది. దానిభర్త కాలకుంజుడు, వాని కొడుకు వికుంజుడు, ప్రశాంతముగా తపము చేసికొనుచున్న మమ్ము పట్టి వారు బాధించుచున్నారు. వారి బాధలు పడలెకున్నాము. మాకు రక్షణ కలిగింపుము" అని కోరుదురు. కలికిమూర్తి వారి పైదండెత్తి వెళ్ళి ఘోర యుద్దములో వారిని సంహరించి మునులకు ప్రశాంతస్థితిని కలిగించును.

తరువాత కలికి మూర్తి హరి ద్వారమునకు బోయి గంగాస్నానము చేసి అక్కడి మహామునులను సందర్శించి నమస్కరించి దీవెనలుపొంది, వారందరును పూర్వము ధర్మ మార్గముననుసరించి నడచిన క్షత్రియు లేయని తెలిసికొని వారి వృతాంతములను అడుగును. అపుడు మరుత్తు అనురాజు తన వంశ చరిత్ర నిట్లు కలికి మూర్తికి వినిపించును.       

నేను సూర్యవంశములో జనించినాను. నా పూర్వులు రఘువు దశరధుడు మున్నగు మహానుభావులు. ఈ సూర్యవంశమునందే శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరాముడు పుట్టి రావణాది రాక్షస సంహారము చేసెను" అని చెప్పెను.                               

కలికి మూర్తి ఆ శ్రీరామచంద్రుని కధ సర్వపాపహరము. కావున ఆ కధ వినవలెనని కుతూహలపడుచున్నాను. దయచేసి విని వినిపింపుమని యడగగా మరుత్తు తన వంశ పూర్వుడైన శ్రీరాముని కధను ఇట్లు వినిపించెను.  

శ్రీ రామ చరిత్ర

అయోధ్యా నగరమునకు రాజు దశరధుడు. అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అను మువ్వురు భార్యలు. ఎన్నాళ్ళకును సంతానము కలుగలేదు. పుత్ర కామేష్టి చేసెను. యజ్ఞ పురుషుడు వచ్చి పాయ సమిచ్చెను. రాజు తన మువ్వురు రాణులకును పాయసము త్రాగ నిచ్చెను.

కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు - శత్రుఘ్నుడు అను ఇద్దరును, కైకేయికి భరతుడును పుట్టిరి. రాజు సంతోషించి వారికి చదువులు చెప్పించెను. విశ్వామిత్రుడు తన యజ్ఞమును కాపాడుటకై శ్రీరామలక్ష్మణులను

No comments:

Post a Comment