Monday, March 31, 2014

శ్రీ రామ కధ పూజా విదానం-1




శ్రీ రామ కధ

ఈ క్రింద ఈయబడిన శ్రీరాముని పూజను భక్తితో ఆచరించి, కధను చదువు కొన్నచో తలచిన
 కార్యములు నెర వేరునను నమ్మకం కలదు .ఇది ఐదు గురువారములు ,
 ఐదు ఆది వారములు వరుసగా చేయవలయును .
మధ్యలో ఏదైనా విఘ్నము ఏర్పడినచో ఆ వారమును వదలి తరువాతి వారము లెక్క పెట్టు కోన వచ్చును .
ఈ పూజకు కావలసిన సామాగ్రి :
రాగి లేదా వెండి కలశము ,శ్రీ రామ పట్టాభి షేకం ఫోటో , తమల పాకులు (తాంబూల మిచ్చుటకు) ,
 వక్క, పసుపు , కుంకుమ , గంధం ,అక్షతలు ,పువ్వులు ,కర్పూరం ,అగరువత్తులు , 
గోధుమ పిండి (అయిదు చిన్న ఉండలకు సరి పోయేంత ), చక్కెర ,నెయ్యి
 (దీపారాదనకు ,ప్రసాదమునకు సరిపోవు నంత )
పూజా విధానము :
తల స్నాన మాచరించి ,పరి శుబ్రమైన వస్త్రములు ధరించి ,దేవుని వద్ద శుభ్రము చేసుకొని బియ్యం
 పిండితో పద్మము ఏర్పరిచి ,అందు శ్రీరాముని పట్టాభిషేక పటమును పెట్టి , 
 పటము పువ్వులతో అలంకరించి ,గోధుమ పిండి ,నెయ్యి ,చక్కెర కలిపిన ప్రసాదమును అయిదు ఉండలుగా చేసి , 
చిన్న పళ్ళెంలో ఆకులు ,వక్క , ఈ ఉండలను పెట్టి ,దేవుని ముందు పెట్ట వలెను .
నెయ్యితో దీపమును వెలిగించి ,సంకల్పము చదువు కొనవలెను. పూజను ఆచరించి , 
పిండితో చేసిన అయిదు ఉండలను నైవేద్యము పెట్టవలెను.
 తరువాత చేతిలో అక్షతలు తీసుకొని ,ఈ క్రింది కధను చదువుకొని , 
హారతి ఇచ్చి ,ప్రదక్షణం చేసి అక్షతలను తలపై వేసుకొనవలెను .
 పిదప పిండితో తయారు చేసిన ఐదు ఉండలను తాంబూలములో పెట్టి ఒక ముత్తై దువకు
బొట్టు పెట్టి ఈయవలెను. సాయంత్రము మరల హారతి ఇవ్వవలెను.
 ఒక పూట మాత్రము భోజనము చేయవలెను.
పూర్వం ఒక పట్టణ ముండెను. అది కష్ట సుఖములకు నెలవై యుండెను.
 ఆ పట్టణ మందు అరశు శెట్టి ,మంత్రి నివసించు చుండిరి.
కేశవ భట్టు అను విప్రుడు కూడా ఉండెను. కేశవ భట్టు మహా దరిద్రుడు .
బార్యా బిడ్డలను పోషించ లేక అతడు దేశాంతర మున కేగెను. 
ఆ విధంగా పోవుచుండగా ఒక అడవి వచ్చెను. అచ్చట కొందరు ఋషులు తపము ఆచరించు చుండిరి.
 వారిని చూచి కేశవ భట్టు సమీపమున నున్న చెరువులో స్నానము ఆచరించి ,
 ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించెను.
 వారు తపస్సు పూర్తి అయిన తరువాత కేశవ బట్టును చూచి ,నీవెవరువు? 
 పులులు ,సింహములు సంచరించు ఈ అడవికి ఎందుకు వచ్చితివి? అని అడిగిరి.
 అపుడు కేశవ బట్టు నా పేరు కేశవ బట్టు .నేనొక దరిద్ర బ్రాహ్మణుడను, 
బార్యా పుత్రులను పోషించ లేక దేశాంతరము వెళ్ళు చుంటిని .
తమ దర్శనము దొరికెను. ధన్యుడను .పోయి వచ్చెద అనెను .
అపుడు వారు 'నీ బార్యా పిల్లలు నిన్ను నమ్మి జీవించు చున్నారు .
వారిని వదలి రావచ్చునా ? అని ,నీకు మేమొక రాముని కధను చెప్పెదము .
వినుము.రామునికి పూజను చేసుకొని ఈ కధను చదువు కొన్నచో నీకు సకల
 సౌభాగ్యములు ,సుఖములు కలుగును.



1  2 3

No comments:

Post a Comment