రాగి పాత్రలో పోసి పాలు త్రాగుటయు ,ఎంగిలి ఆకులో నేతితో గూడిన అన్నము తినుటయు, పాలలో ఉప్పు వేసికొని త్రాగుటయు ,గోమాంస భక్షణముతో సమానము .కంచు చెంబులో పోసిన కొబ్బరి నీరు ,(రాగి పాత్రలో నైనను ) రాగి చెంబులో ని చెరకు రసము కల్లు వంటి దగును. అది త్రాగ రాదు. లేచి నిలబడి ఎడమచేతితో మంచినీళ్ళు త్రాగినచో వాడు ధర్మహీనుడగును.
పాడ్యమి నాడు గుమ్మడికాయ తినరాదు .అది ధన నాశనము చేయును .విదియ నాడు పొట్లకాయ తినరాదు. శత్రు వృద్ది చేయును. తదియ ,చవితి తిదులలో ముల్లంగి దుంప తిన్నచో ధన నాశనము కలుగును పంచమినాడు దొండకాయ తిన్నచో అపనిందలు కలుగును .షష్టినాడు వేపపూవు తిన్నచో పశు పక్ష్యాదులలో జన్మించును. సప్తమి నాడు తాటి పండు తిన్నచో రోగము వృద్ది యగును. అష్టమినాడు కొబ్బరికాయ తిన్నచో బుద్ది నశించును .నవమినాడు ఆనపకాయయు ,దశమి నాడు తీగ బచ్చలియు ,ఏకాదశినాడు నల్ల పెసలు ,(తంబ తీగ ) ద్వాదశి యందు పూతికయు ,(నెమిలడుగు చెట్టు అని శబ్ద రత్నాకరము ) త్రయోదశి నాడు ములగ కాయ (వార్తాకి )తిన్నచో పుత్ర నాశనము కలుగును. చతుర్దశి నాడు మినుములతో చేసిన పదార్దములు దినుట మహా పాపము .పున్నమి అమావాస్య లందు మాంసము తినరాదు .
పూర్ణిమ నాడు ,సంక్రాంతి నాడు (నెలకొకసారి వచ్చు సంక్ర మణములు ) అమావస్య- చతుర్దశి -అష్టమి తిదులందును , శ్రాద్ధ దినము లందును ,వ్రత దినములలోను స్త్రీ సంగమము నిషేదము .తలకు నూనె రాచుకొనుట నిషేదము . పొట్ల ,దొండకాయ , మాంసము కంచు పాత్రలో భోజనము నిషిద్దములు .
No comments:
Post a Comment