Tuesday, May 6, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam40




దేవ్యాయ యాత త మిదం జగదాత్మశక్త్యా
ని: శేషదేవగణ శక్తి సమూహమూర్త్యా
తామమ్బికా మఖిల దేవమహర్షి పూజ్యాం
భక్త్యానతాః స్మవిధ ధాతు శుభాని సానః   3
అర్ధము: (3వ శ్లో): తన శక్తి చేత ఈ జగత్తు నందు అంతటను వ్యాపించి యుండునదియు సర్వదేవగణములు శక్తి సమూహము యొక్క మూర్తరూపమైనట్టిదియు, సర్వ దేవతలచేతను, మహర్షుల చేతను ఆరాధింపదగినదియు అగు అంబికకు సభక్తికముగా ప్రణమిల్లుచున్నాము. మాకు ఆమె శుభములను ఇచ్చుగాక.
యస్యాం ప్రభావమతులం భగవానన్తో
బ్రహ్మ హరశ్కచ న హి వక్తు మలం బలం చ
సా చండి కా ఖిల జగత్పరి పాలనాయ
నాశాయ చాశుభ భయస్య మతిం కరోతు   4
అర్ధము:(4వ శ్లో): ఎవరి అసమాన బలప్రభావమునులను బ్రహ్మవిష్ణు మహేశ్వరులు వర్ణింపజాలరో, ఆ చండిక సర్వజగత్తును పరిపాలించుటయందును, అమంగళమువలని భయమును నాశిల్ల చేయుటయందును తన బుద్ధిని వినియోగించుగాక.

యాశ్రీ: స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీ:
పాపత్మనాం కృతధి యాం హృదయే షు బుద్ధి:
శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా
తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్    5
అర్ధము:(5వ శ్లో): "పుణ్యపురుషుల ఇండ్లయందు సంపదగను, పాపాత్ముల ఇండ్లయందు ఆశుభముగను, విద్వాంశుల హృదయములందు బుద్ధి (జ్ఞానము) గాను, సత్పురుషుల హృదయములందు శ్రద్ధగాను, సత్కులజుల హృదయములందు లజ్జగను ఏదేవి స్వయముగా నిలిచి ఉండునో, అ దేవివగు నీకు ప్రణమిల్లుచున్నాము. నీవు జగత్తును పరిపాలింతువు గాక.    
కిం వర్ణ యామ తవ రూపమచిన్త్య మేతత్
కిచ్చాతి వీర్య మసుర క్షయకారి భూరి
కిం చాహవేషు చరితాని తవాటి యాని
సర్వేషు దేవ్య సురదేవ గణాది కేషు   6

 First   20   21  22   23   24   25   26   27   28   29   30   31   32  33  34  35  36  37  38  39  40  41  Last

No comments:

Post a Comment