దేవీ శూలేన వజ్రేణ బాణైర సిభి: ఋష్టి భి:
జఘాన రక్త బీజం తం చామున్డాపీత శోణితమ్ 61
అర్ధము:(61వ శ్లో): దేవి శూలముతోను, వజ్రాయుధము తోను, బాణములతోను, ఖడ్గముతోను, ఈటెలతోను రక్త బీజుని కొట్టెను, చాముండ అతని రక్తమును త్రాగుచుండెను.
స పపాత మహీప్రుష్టే శస్త్ర సజ్గ సమాహతః
నీ రక్త శ్చ మహీపాల రక్త బీజో మహాసురః 62
అర్ధము:(62వ శ్లో): రాజా, ఆ రక్త బీజమహాసుడురు అనేక శస్త్రములచే మిక్కిలి గాయపరుపబడి
రక్త హీనుడై భూమిపై కూలెను.
తతస్తే హర్ష మతులమవాపుస్త్రి దశా నృప
తేషాం మాత్రుగణో జతో ననర్తా సృజ్మదోద్దత 63
అర్ధము:(63వ శ్లో): రాజా, అంతట దేవతలు
మిక్కిలి హర్షము పొందిరి. వారిలో నుండి పుట్టిన మాత్రుకాగణము రక్త పానోన్మత్త తచే నృత్యము చేసెను.
ఇతి శ్రీ మార్కండేయ పురాణే సావర్ణి కే మన్వన్తరే
దేవీ మమాత్మ్యే రక్త బీజధో నామ
అష్ట మోధ్యాయః
శ్రీ మార్కండేయ పురాణమందలి సావర్ణి మన్వంతరమున
"దేవీ మహాత్మ్యము" లో "రక్త బీజవధ" అను
పేరిటి
అష్టమాధ్యాయము సంపూర్ణము.
నవమాధ్యాయము
రాజో వాచ || 1
విచిత్ర మిద మాఖ్యాతం భగవ భవతా మమ |
దేవ్యాశ్చరిత మహాత్మ్యం
రక్త బీజవ ధాశ్రితమ్ ||
No comments:
Post a Comment