దేవగంధర్వులను ప్రజలు ఇచట నివసింతురు. వారికి
మనస్తాపములు, రోగములు లేవు. సౌఖ్యానుభవమే వారికి సహజము. అనుతుప్త, శిఖి, విపాశ, త్రిదివ, క్రమునామక, అమృత, సుకృత అను యేడు నదుల ద్వీపమున ప్రవహించును.
ఈ నడులపెర్లు స్మరించిన పాపములు పోవును. ఇక్కడ యాగావస్థలు లేవు.
ఎల్లప్పుడూ త్రేతాయుగము నందువలె ధర్మములు నడుచుచుండును. ప్రజలు 5 వేల సంవత్సరములు జీవింతురు.
ఆర్యక, కురు, వివిశ్వ, భావి నామములతో నాలుగు వర్ణములవారు
నుందురు. ప్లక్ష వృక్షములు (జువ్విచెట్లు) ఉన్నవి
గాన దీనికి ప్లక్షద్వీపమని పేరు గలిగెను.
శాల్మల ద్వీపము: దీనికి పాలకుడు వీరుడు. దీనిలో గూడ, శ్వేతము, హరితము, జీమూతము, రోహితము, వైద్యుతము, మానసము, సుప్రభము, అను యేడు వర్ణములు గలవు. శాల్మల
(బూరుగు) వృక్షములు ఉండుటచే ఈ స్వీపమునకు అదే పేరు వచ్చెను. ఇక్షు (చెరకు) రస సముద్రము దీని చుట్టూ నుండును.
ఉన్నతము, మూహకము, ఓషధి నిలయమైన ద్రోణము, కంకము, మహిషము, కుకుద్మతము అను పేరుగల
కులపర్వతములు ఇచ్చట నుండును. శ్రేణి, తోయ, విత్రుష్ణ, చక్ర, శుక్ర, విమోచని, నివృత్తి అను ఏడునదులు ఇచట ప్రవహించును. కపిలులు, అరుణులు, పీతవర్ణులు, కృష్ణవర్ణులు అను పేరులతో బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు
అను చాతుర్వర్ణ ములవారును ఉందురు. వారక్కడ విష్ణువును పూజింతురు. యజ్ఞ
యాగములు చేయు ఉద్దేశ్యము గలవారు, వాయు భూతునిగా భగవంతుని నారాధింతురు. అతనికి
ప్రీతిగా (మానసిక) యజ్ఞములు చేయుదురు. ఇందుండువారు ఐదువేల సంవత్సరములు
జీవింతురు.
కుశద్వీపము: కుశద్వీపము సురాసముద్రముచే
ఆవరింపబడి యుండును. శాల్మలీ ద్వీపము కంటే రెట్టింపు వైశాల్యము కలది.
దీనియందు ఏడు వర్షములు గలవు. ఉద్భిదము, వేనుమంతయు, స్వైరధము, వితతము, రంధనము, ధృతి మున్నగు ఏడు పర్వతములు గలవు. అచట దేవదానవులతో పాటు కొందరు
పుణ్యాత్ములైన మనుష్యులును, గంధర్వులును కూడా ఉందురు.
దామి, శుష్మి, స్నేహ, మందేహా నామములతో బ్రాహ్మణ
క్షత్రియ వైశ్యశూద్రులు ఉందురు. వారు బ్రహ్మరూపుడైన జనార్ధనుని
ఆరాధింతురు. అధికారములకై ఎగబడరు. ద్రుతపాప, శివ, పవిత్ర, సమ్మతి,. విద్యుత్తు, అంభస్తు, మహి అను ఏడునదులు అచట గలవు. కుశ స్తంభములు (దర్భకాడలు)
ఎక్కువగా ఉండుటచే దీనికి కుశద్వీపము అను పేరువచ్చెను.
No comments:
Post a Comment