మహేశ్వరీ త్రిశూలేన తథా చక్రేన వైష్ణవీ
దైత్యాచ్చ ఘాన కౌమారీ తథా శక్త్యా తికో పనా 34
అర్ధము:(34వ శ్లో):
మహేశ్వరి త్రిశూలముతోను,
వైష్ణవి చక్రముతోను, కౌమారి భల్లముతోను కోపమున దైత్యులను పరిమార్చిరి.
ఐన్ద్రీ కులిశ పాతేన శతశో దైత్య దానవాః
పేతుర్విదారితాః పృత్వ్యాం రుదరౌఘ ప్రవర్షిణః 35
అర్ధము:(35వ శ్లో): " ఐంద్రి తమపై ప్రయోగించిన వజ్రాయుధము వలన
చీల్చివేయబడి దైత్యులును దానవులను నూర్ల కొలదిగా నేలకూలిరి. వారిలో నుండి
రక్త పునాదులు ప్రవాహించెను.
తున్డ పరహార విధ్వస్తా దంష్టాగ్ర క్షతవక్షసః
వారాహ మూర్త్యా స్య పతంశ్చ క్రేణ చ విదారితాః 36
అర్ధము:(36వ శ్లో): వారాహియొక్క ముట్టె దెబ్బలవలన ధ్వంసము చేయబడి కోరల మొన
పోటువలన గాయపడి, చక్ర పుతాకుడువలన
చీల్చి వేయబడి (అసురులు) పడిపోయిరి.
న ఖైర్విదారి తాం శ చాన్యా భక్షయన్తీ మహాసురా
నారసింహీ చ చారాజౌ నాదాపూర్ణ దిగమ్బరా 37
అర్ధము:(37వ శ్లో): "నారసింహి ఆకాశమును, దిక్కులను తనవాదములతో నిండించుచు, తన గోళ్ళతో చీల్చబడిన
మహాసురులను భక్షించుచు యుద్ధములో సంచరించెను.
ఛండాట్ట హాసైర సురాః శివదూత్యభి దూషితాః
పేతు: పృథివ్యాం పతితాంస్తాం శ్చ ఖాదాథ సా త దా 38
అర్ధము:(38వ శ్లో): శివదూతియొక్క భయంకరములగు అట్టహాసముల (పెద్ద నవ్వు) వలన
ధైర్యము సడలి అసురులు నేలపై కూలి పడుచుండిరి. ఆ కూలిన వారిని ఆమె
భక్షించుచుండెను.
ఇతి మాతృగణం కృద్ధం మర్ద యన్తం మహాసురా
దృష్ట్వాభ్యుపా యైర్వివిధై ర్నే శుర్దే వారి సైనికాః 39
అర్ధము:(39వ శ్లో):
"దోషపూరితలైన మాతృకలు వివిధోపాయములచే మహాసురులను ఇట్లు మర్దించుట చూచి సురవైరి
సైనికులు పారిపోయిరి.
No comments:
Post a Comment