Wednesday, May 21, 2014

శివ గీత 65




శరీరములో మూడువందల అరువది (360) ఎముక లుండును.
 అవి జలములు, కపాలములు, రుచకములు, తరణములు,
 మరియు నలకలమునియు జ్ఞానులు చెప్పుదురు.
ఐదు విధములుగాను చెప్పుదురు.
ప్రతీ శరీరములో రెండువందల పది ఎముకల సంధులుండును.
ఇట్టి అస్థి సంధులు రౌరవములు, ప్రసరములు, స్కంద సేచనములు,
ఉలూక లములు, సముద్రములు, మండలములు,
శంఖావర్తములు, వాయసమండలములు అని ఎనిమిది రకాలుగా చెప్పబడును.
 ఈ దేహమునందు మూడు కోట్ల ఏబది లక్షలు వెంట్రుకలు లుండును.
తల వెంట్రుకలు, మరియు మీసముల వెంట్రుకలు
మూడులక్షలు (3,00,000) ఉండును.
 
దేహ స్వరూపమేవం తే ప్రోక్తం దశరథాత్మజః,
తస్మా దసారో నాస్త్యేన - పదార్దో భునత్రయే                   51

దేహేస్మిన్నభి బానేన - న మ హొ పాయ బుద్ధయః
అహంకారేణ పాపాని - క్రియంతే హంత సాంప్రతమ్       
తస్మా దేతత్స్వ రూపం తు విభో ద్ధవ్యం మనీ షిణా       52

                            ఇతి శ్రీ పద్మ పురాణాంతర్గత శివగీతాయాం
 నవమోధ్యాయః
ఓయీ రామా! నీకు ఈ శరీరము యొక్క స్వరూపమును
 సంపూర్ణముగా వివరించితిని.
మూడు లోకములోనూ ఈ దేహము కంటెను హీనమైనదే వస్తువు
 లేదు సుమా! గొప్పతెలివి (బుద్ధి) నిపుణత గల జ్ఞాన సంపన్నులు
 జూడా ఇట్టి సారములేని శరీరము పట్ల మిగుల అభిమానము
వలన అహంకారులై పాపకర్మల నాచరింతురు.
కనుక జ్ఞానులైన వారు ఇట్టి హేయమైన దేహనిజ
స్వరూపమును సంపూర్ణముగా తెలిసికొనవలయును.
 (శరీరాభిమానమును వీడి ఆత్మనురక్తిని

పెంచు కొనదగునని) భావము.

ఇట్లు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును,
 శ్రీశివ రామ, సంవాద (ప్రశ్నోత్తర) రూపాత్మకమగు శ్రీ శివగీతలో
 శరీర నిరూపణమను తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.    

దశమాధ్యాయము
జీవ స్వరూప నిరూపణము




First   60   61   62  63   64   65  66  67   68   69  70  71    Last


No comments:

Post a Comment