శివపంచ మూర్త్యు పాసన :-
లింగోపాసన తరువాతగా
మంత్రమయ పంచమూర్తి ఉపాసన ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. సద్యోజాత
వాసుదేవ, అగోర, తత్పురుష, ఈశానులను అయిదు ముఖాలు పరమేశ్వరునకున్నాయి.
సద్యోజాత ముఖము తూర్పుకభిముఖంగాను, వాయుదేవ ముఖము దక్షిణమున
కభిముఖంగాను అఘోర ముఖము పశ్చిమమున కభిముఖంగాను తత్పురుషముఖం, ఉత్తరమున
కభిముఖంగాను ఈశాన ముఖం ఊర్ద్వానికభిముఖంగాను ఇలా పరమేశ్వరుడు పంచాననుడని
ఉపాసింపబడ్డాడు. శివ పురాణం ప్రకారం ఈశాన్య ముఖం విలాసమయం గాను, తత్పురుష
ముఖం తపోమయంగాను, అఘోరముఖం సంహారకంగాను, వాసుదేవముఖం అహంకారమయంగాను
సద్యోజాతముఖం జ్ఞానాత్మకంగాను ఉంటాయి.
No comments:
Post a Comment