Thursday, May 1, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam50




కల్యాన్యై  ప్రణతా వృద్ద్యై సిద్ద్యై కుర్మో నమో నమః l
నైర్రుత్యై భూభ్రుతాంలక్యై శర్వాన్యై తే  నమో నమః : 11
అర్ధము : (  11  వ శ్లో) '' శుభ స్వరూపిణి కి నమస్సులు ; అభ్యదయ మునకును, విజయమునకు ను స్వరూప మైన యామెకు నమస్కారములు . భూపాలురకు అభాగ్య దేవతయు , భాగ్య దేవతయు కూడ అగు శివ పత్నికి నీకు నమస్కారములు .

దుర్గా యై దుర్గ పారాయై సారాయై సర్వ కారిన్యై l
ఖ్యా త్యైతథైవ కృష్ణా యై ధూమ్రాయై సత తం నమః l l 12
అర్ధము : (12 వ శ్లో) '' కష్ట ములందు దాటించునదియు, సార స్వరూపిణి యు ,సర్వ కార్యములను ఒనర్చు నదియు , '' ఖ్యాతి '' అగునది యు (వివేకజ్ఞాన మగునది ), కృష్ణ (నల్లని) వర్ణయు, దూమ (పొగ) వర్ణయు అగు దుర్గా దేవికి ఎల్లప్పుడు ను నమస్కారములు.

దేవీ మహత్యము పేజి  44
అతి సౌమ్యాతి రౌద్రాయైనతాస్త స్యైనమో నమో : l l 13
అర్ధము : (1  నుండి 2  వ శ్లో) '' అతి సాధు స్వరూపయు అతి  రౌద్ర స్వరూపయు అగు ఆమెకు మాటి మాటికి చాగిలి  మొక్కు చున్నాము .జగత్తు ను భరించు చుండు ఆమెకు నమస్కారములు.

యాదేవీ సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్ది తా !
నమస్త స్యై, నమస్త స్యై ,నమస్త స్యై నమోనమః l  l 14 ,15 , 16
అర్ధము :(14 నుండి 16 వ శ్లో ) '' సర్వ భూతములందు ను విష్ణు మాయా స్వరూప యై యుండు దేవి కి మాటి మాటి కి నమస్కరములు .

యాదేవి సర్వ భూతేషు చేతనేత్యభి దీయతే l
నమస్త స్యై, నమస్త స్యై ,నమస్త స్యై నమోనమః l l 17 ,18 , 19
అర్ధము :(17 నుండి 19 వ శ్లో ) ''సర్వ భూతములందు ను చేతాన (తెలివి) స్వరూప యై యుండు దేవికి మాటి మాటికి నమస్కారములు .

 First   40  41   42  43  44  45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61   Last

 

No comments:

Post a Comment