Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము68




రీక్ష్యము లై మెరయుచున్న పండ్లు గలది యు అగు కాళి అత్యంత రోషముతో భయంకరముగా నవ్వెను.
ఉత్దాయచ మహా సింహం దేవీ చండ మధావతః |
గృహీత్వా చాస్య కేశే షు శిరస్తే నాసినాచ్చి నత్|| 20
అర్ధము: ( 20 వ శ్లో ) అంతట ఆ (కాళికా )దేవి తన మహా సింహము పై ఎక్కి, చండుని మీదికి ఉరికి, అతనిని వెండ్రుకలతో పట్టుకుని అతని శిరస్సును ఖడ్గముతో నరికెను.

అధ మున్డో భ్యదా వత్తాం దృష్ట్వా చండం నిపాతితమ్|
తమప్య పాత యద్భూ మౌ సా ఖడ్డాభి మతం రుసా || 21
అర్ధము :(21  వ శ్లో ) చండుడు కూలుట చూచి ముండుడు కూడా ఆమె పైకి ఉరికెను. ఆమె అతనిని కూడా రోషమున తల ఖడ్గముతో నరికెను.

హత శేషం తతః సైన్యం దృష్ట్వా చండం నిపాతితమ్|
మున్డంచ సుమహా వీర్యం దిశో భేజే భయాతురమ్|| 22
అర్ధము: (22 వ శ్లో ) చండుడును, అత్యంత శౌర్య వంతుడగు ముండుడును కూల్చ బడుట చూచి, అప్పటికి చావక మిగిలియున్న సైన్య మంతయు సంభ్ర మముతో దిక్కుల బట్టి పారి పోయెను.

శిర శ్చండ స్య కాళీ చ గృహీత్వా ముండ మేవచ |
ప్రాహ ప్రచండాట్డ హాస మిశ్రమ భ్యేత్య చండికామ్ || 23
అర్ధము( 23 వ శ్లో ) కాళి చండ ముండుల శిరస్సులను, తన చేతులతో పట్టుకుని చండిక యొద్దకు పోయి ప్చండము గాను ,బిగ్గరగాను, నవ్వుచు ఇట్లు చెప్పెను.

మయా తవాత్రో పహృతౌ చండ మున్డౌ మహా పశూ |
యుద్ద యజ్ఞే స్వయం శుమ్భం ని శుమ్భం చ హనిష్యసి|| 24
అర్ధము: (24 వ శ్లో ) " ఈ యుద్ద యజ్ఞము నందు యజ్ఞ పశువులుగా సమర్పింప బడిన చండ ముండులను నీ యొద్దకు తెచ్చితిని.
శుంభ ని శుంభు లను నీవు స్వయముగా చంపుడువు "
ఋషి రువాచ || 25

తావా నీతౌ తతో దృష్ట్వా చండ మున్డౌ మహా సురౌ|
ఉవాచ కాళీం కళ్యాణీ లలితం చండి కావచః || 26
అర్ధము : (25 నుండి 26 వ శ్లో ) ఋషి పలికెను: అంత తన యొద్దకు తేబడిన ఆ చండ ముండ మహాసురులను

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

 

No comments:

Post a Comment