శివసాకారో పాసన:
కనిపించని పరమాత్మ
ఉత్తమాధికారులు నిర్గుణ. నిరాకారంగా భావించగలగ వచ్చు. కాని మధ్యమాధి కారులందరు అలా భావించలేరు. మధ్యమాధికారులు కూడా ధ్యానించి సేవించి
తరించడం కోసం శాస్త్రాల్లో భక్తుల అభీష్టమైన రూపాలు లక్షణాలు పేర్లు
చిహ్నాలు స్థానాలు పరమేశ్వరునికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ముందుగా ఆయా స్థానాల్లో
ఆయా చిహ్నాలతో ఆయారూపంతో ఉపాసించి, క్రమంగా నిర్గుణ నిరాకారంగా సర్వత్ర
ఉండే పరమాత్మ దర్శనానికై మధ్యమాధికారులు కూడా అర్హులు కావాలి అనేదే
శాస్త్రకారుల అభిప్రాయం. ఇతర ఉపాసకులతో విభేదించడం. ద్వేషించుకోవడం పరస్పరం
నాశంచేసికోవడం మనలక్ష్యం కాదు.
ఒక పరమేశ్వరునికి
కొందరు ఋషులు జటాజూటం, శ్వేతరూపం భస్మధారణ, రుద్రాక్షమాల, త్రినేత్ర
చతుర్భుజాలు కృష్ణాజిన గజర్మవస్త్ర డమరు త్రిశూలాది ఆయుధ గ్రహణం నమ్దివాహనం
శివ, ఈశ్వర, రుద్రా, శర్వమృడ, పశుపతి, శితికంట, పార్వతీపతి, శూలి ఆది నామ సంభోధనం కలిగినట్లుగా
ఉపాసించారు. మరికొందరు ఋషులు పరమేశ్వరునికే కిరీతహార కేయోఊరాది
భూషణ శంఖచక్ర గదా పద్మ ధారణం కృష్ణరూపం గరుడవాహనం, పీతాంబర
ఊర్ధ్వ పుండ్రాద్యలంకరణం వి౮శ్ను, పద్మనాధ, పుండరీకాక్ష, జనార్ధన
నాయనాది నామ సంభోధనం చేశారు. గణపతి, సూర్య, సుబ్రహ్మణ్య ఆది మూర్తులు. లక్ష్మీ సరస్వతి పార్వతీ మహాత్రిపుర సుందరీ బాలా
రాజరాజేశ్వర్యాది స్త్రీ రూప మూర్తులను ఇలాగే ఉపాసించబడుతున్నాయి.
No comments:
Post a Comment