అర్ధము: (6వ శ్లో):
"దేవీ, తలచుటకు
అలవికాని (మనస్సునకు అందని) ఈ నీ రూపమును గాని, రాక్షసులను నశింపచేయు నీ
వీర్యాతిశయమునుగాని, దేవాసురాది
గణముల యొక్క యుద్ధము
లన్నింటియందు నీవు చేయు అత్యద్భుత చర్యలుగాని వర్జించుట మాకు ఎట్లు సాధ్యమగును?
హేతు: సమస్త జగతాం త్రిగుణాపి దోషై :
న జ్ఞాయ సే హరి హరాది భి ర ప్యపారా
సర్వాశ్రయాఖిలమిదం జగదంశభూత
మవ్యాక్రుతా హి పరమా ప్రకృతిస్త్వమాద్యా 7
అర్ధము: (7వ శ్లో):
"సర్వజగత్తులకు నీవు కారణమవు! నీవు త్రిగుణాత్మిక వయ్యును వానిలోని దోషములు నీయందు కానరావు
! హరి హరాదులు కూడా నిన్ను గ్రహింపజాలరు. ఎల్లరకును నీవే అండవు! ఈ
జగత్తంతయు నీలో ఒక స్వల్పభాగము నుండి ఉత్పన్నమైనది. నిజముగా నీవు
సర్వాధికయగు (వేరు పరుపబడని) ఆదయ ప్రకృతివి.
యస్యాః సమస్త సురతా సముదీ రణేన
తృప్తిం ప్రయాతి సకలేషు మఖే షు దేవి
స్వహాసి వై పితృ గణస్య చ తృప్తి హేతు -
రుచ్చార్య స్వ త్వమత ఏవ జనైం స్వధా చ 8
అర్ధము: (8వ శ్లో):
"దేవీ, యజ్ఞము
అన్నిటి యందును ఏ మంత్రమును ఉచ్చరించుటచే సమస్త దేవగణములు తృప్తి నొందునో, ఆ స్వాహా మంత్రమవు నీవు.
పితృదేవతా గణమునకు తృప్తినిచ్చు
స్వధామంత్రమవు నీవు. కావున జనులు నిన్ను (యజ్ఞములలో స్వాహా, స్వధా) అని పలుకుదురు.
యాముక్తి హేతుర విచిన్త్య మహావ్రతా త్వం
అభ్యస్యసే సునియ తేన్ద్రియతత్త్వ సారై:
మొక్షార్ది భిర్ము నిభి రస్త సమస్త దోషై
ర్వద్యా సీసా భగవతీ పరమాహి దేవి 9
అర్ధము: (9వ శ్లో):
"దేవీ, నీవు
భగవతిని, మోక్ష
హేతువును ఊహింపశక్యము కాని మహాతస్సులకు హేతువును, అగు పరావిద్యవు, నీవు. మొక్షార్ధులను ఇంద్రియములను చక్కగా వశపరచుకొన్నవారును, (పర) తత్త్వము (పరమ సత్యము) నందు
ఆసక్తులును, దోషములన్నింటిని
పోగొట్టుకొన్నవారును, అగు మునులు
(పరావిద్య నగు) నిన్ను అభ్యసింతురు.
No comments:
Post a Comment