అర్ధము:(5వ శ్లో):
"నా ఆజ్ఞను పరిపాలించి కోటి వీర్య కుటుంబములు ఏబదియు, ధౌమ్ర కుటుంబములు నూరును బయలు దేరు గాక.
కాలకా దౌర్హ్రదా మౌర్యాః కాలకే యాస్త థాసురా:
యుద్ధాయ సబ్జా నిర్యాన్తు ఆజ్ఞాయా త్వరితా మమ 6
అర్ధము:(6వ శ్లో): "కాలక దౌర్హ్రదులు, మౌర్యులు, కాలకేయులు ఈ
అసురులందరు కూడా - నా ఆజ్ఞాను వర్తులై
వెంటనే యుద్ధ సన్నద్ధులై బయలు దేరుదురు గాక"
ఇత్యా జ్ఞాప్యా సురపతి: శుమ్భౌ భైరవ శాసనః
నిర్జగామ మహా సైన్య సహాస్రైర్బ హుభి ర్వ్రుతః 7
అర్ధము: (7వ శ్లో): ఈ ఆజ్ఞల
నొసంగి చండ శాసనుడును,
అసుర నాథుడును అగు శుంభుడు అనేక
సహస్రసంఖ్య గల మహాసైన్యముతో తానూ బయలువెడలెను.
ఆయాన్తం చండికా దృష్ట్వాత త్సైన్య మతిభీ షణమ్
జ్యాస్వనై: పూరా యామా స ధరణీ గగనాన్త రమ్ 8
అర్ధము:(8వ శ్లో): అతి భయంకరమగు ఆ సైన్య పురాకను చండిక చూచి తన
అల్లెత్రాటి టంకార ధ్వనితో
భూమ్యాకాశముల నడి మిప్రదేశము నంతయు నింపెను.
తతః సింహొ మహానాద మతీవ కృత వాన్న్రుప
ఘన్డా స్వనేన తాన్నాదాన మ్బికా చో పబృం హయత్ 9
అర్ధము: (9వ శ్లో): అంతట, రాజా,
సింహము మహానాదము చేసెను. అంబిక ఆ
సింహనాదములను తన ఘంటానాదముచే ఇంకను వృద్ధి పరచెను.
ధనుర్జ్యా సింహ ఘన్డానాం నాదా పూరిత దిజ్ముఖా
నినాదై ర్భీషణై : కాళీ జిగ్యే విస్తారి తాననా 10
అర్ధము:(10వ శ్లో): కాళి తన
నోటిని విస్తారముగా తెరచి,
దిక్కులను హుమ్కార శబ్దముతో నిండించి,
No comments:
Post a Comment