శబ్ద స్శ్రోత్రం ముఖరతా - వైచిత్ర్యం సూక్ష్మ తా ధృతి 24
బలంచ గగనా ద్వాయో - స్స్వర్శశ్చ స్పర్శనేంద్రియమ్,
ఉతేక్ష పణ మనక్షే పా - కుంచనే గమనం తథా 25
ప్రసారణ మీటి మాని - పంచ కర్మాణి రూక్షతా,
ప్రాణపానౌ త థా వ్యాన - సమానో దాన సంజ్ఞ కాన్ 26
నాగం కూర్మం చ కృకరం - దేవదత్తం ధనంజయమ్,
ద శైతా వాయు వికృతీ - స్తథా గృహ్ణాతి లాఘవమ్ 27
నామాంతరము చేత సత్వగుణమని చెప్పబడు అంతఃకరణము,
గుణభేదము వలన మూడు ప్రకారములు
అవియే సత్త్వర జస్త మోగుణములు.
సాత్విక గుణములు ఏమియనగా: ఆస్తికత్వము, శుభ్రత,
ధర్మాసక్తి మొదలగు మంచి గుణములన్నియు సాత్వికగుణములు
(సత్వగుణ జన్మములు) రజోగుణము నుండి రాజసగుణములు
అనగా కామ - క్రోధ - మదము మొదలగునవి.
మధ్యగుణములు, నిద్ర - ఆలస్యము (సోమరితనము) పరమాడం
(జాగ్రత్త లేనిది) వంచించుట ఇవే మొదలగునవి తమోగుణ
జన్యములు తామసములు.
నిర్మలేంద్రియత్వము ఆరోగ్యము.
కుశలత, మొదలగునవి పైన బెర్కొనిన సాత్విక గుణ జన్యములు.
ఈ శరీరము పంచతన్మాత్రాత్మకము, కనుక తద్గుణములనే స్వీకరించును.
శబ్దము శ్రోత్రేంద్రియము. మాటలాడుట, పనిలో నిపుణత లాఘవము,
ధైర్యము, శక్తి - ఇవి ఆకాశమునుండి లభించును. స్పర్శము,
స్పర్శేంద్రియము (చర్మము పైనుండి స్పర్శేంద్రి యమనుట)
చాచుట - వంచుట - ముడుచుట - విస్తరింపచేయుట,
గమనము, కాటిన్యము ప్రాణ - అపాన, వ్యాన ఉదాన,
సమానములు అను పంచ మహావాయువులు,
నాగము కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము
అను పంచోపవాయువులు, తేలికయగుట,
ఈ గుణములు వాయువుచేత లభ్యములు.
తేషాం ముఖ్యతరః ప్రాణో - నాభే కంటాద వ స్థితః
చరత్య సౌ నాసికాయో - ర్నాభౌ హృదయ పంకజే 28
శబ్దో చ్చారణ నిశ్వాసో - చ్చ్యా సాదే రపి కారణమ్
అపాన స్తు గుడే మేడ్రే - కటికం ఘోద రే ష్వపి 29
No comments:
Post a Comment