Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam 24




తతః సమస్త దేవానాం తేజోరాశి సముద్భవామ్|
తాంవిలోక్య ముదం ప్రాపుర మరా మహిషార్ద తాః || 19
అర్ధము:(19 వ శ్లోకము):  సర్వ దేవతాతేజో రాశినుండి సముద్భవించిన ఆమెను చూచి మహిషాసుర పీడితులైన దేవతలు సంతసించిరి.  

శూలం శూలా ద్వినిష్క్రు ష్యద దౌత స్యై పినాక ధృక్ ||
చక్రంద దత్త వా కృష్ణ: సము తపాట్య స్వచక్రత: || 20

శజ్జంచ వరుణః శక్తింద దౌతస్యై హుతాశనః |
మారుతో దత్తవాంశ్చాపం బాణ పూర్ణే తధే షుధీ || 21

అర్ధము:(20 నుండి 21వ శ్లోకము): పినాకపాణి (శివుడు) తన శూలములో నుండి ఒక సూలమును తీసి ఆమెకు ఇచ్చెను. విష్ణువు తన చక్రముతో నుండి ఒక చక్రమును తీసియిచ్చెను. వరుణుడొక శంఖమును, అగ్ని దేవుడు ఒక బల్లెమును ఆమె కిచ్చిరి. వాయు దేవుడొక వింటిని, బాణములతో నిండిన  

వజ్ర మిన్ద్ర: సముత్పాట్య కులిశాద మరాధపః|
దదౌతస్యై సహస్రాక్షో ఘణామైరావతాద్గ జాత్ ||  22

కాలదన్దాద్యమో దణ్డం పాశం చామ్బు పతిర్దదదౌ |
ప్రజాపతిశ చాక్ష మాలాం దదౌ బ్రహ్మా కమన్దలుమ్ || 23

అర్ధము:(22 నుండి 23వ శ్లోకము): వేల్పురేడును, సహస్రాక్షడును అగు ఇంద్రుడు తన వజ్రాయుధములో నుండి ఒక వజ్రాయుధమును, తన ఐరావత గజము యొక్క ఘంటలో నుండి యొక ఘంటను తీసి ఆమెకు ఇచ్చెను. యముడు తన కాలదండములో నుండి ఒక దండమును, వరుణుడొక పాశమును ఇచ్చిరి. ప్రజాపతియగు బ్రహ్మ ఒక అక్షమాలను, ఒక కమండలమును ఇచ్చెను.       

సమస్త రోమకూపేషు నిజరశ్మీ దివాకరః |
కాలశ్చదత్తవా ఖడ్గం తస్యాశ్చర్మచ నిర్మలమ్ || 24

అర్ధము:(24వ శ్లోకము) : సూర్యుడు ఆమె సమస్త రోమ కూపములందును తన కిరణములను ఇచ్చెను. కాలుడు (యముడు) ఖడ్గ మును, నిర్మలమగుడాలును ఆమె కిచ్చెను.

 First   20   21  22   23   24   25   26   27   28   29   30   31   32  33  34  35  36  37  38  39  40  41  Last


No comments:

Post a Comment