నిన్ను స్తుతించిన చో, వానిని కూడ -మాకు ప్రసన్న వైనట్లే- అనుగ్రహించి ధన దారాది సంపదలు , అభ్యుదయము ,విభావములు వానికి సర్వదా ప్రసాదించు చుండుము.
ఋషిరువాచ ll 38
ఇతి ప్రసాది తాదే వైర్జగతోర్ధేన తథాత్మన :
తథేత్యుక్త్వాభద్ర కాళీ బభూవాస్తర్హ తానృప ll 39
అర్థము :- (38 వ నుండి 39 వ శ్లో ) ఋషి పలికెను : రాజా, దేవతలా చేత ఇట్లు లోక హితము కొరకును, తమ హితము కొరకును, (స్తుతింప బడి ) ప్రసన్న యైన భద్ర కాళి '' అట్లే అగు గాక '' అని పలికి అంతర్దాన మొందెను.
ఇత్యేతత్కథితం భూప సమ్భూతా సాయథా పురా l
దేవీ దేవశరీరే భ్యో జగత్త్రయహి తైషిణీ ll 40
అర్థము :- (40 వ శ్లో) నృపాలా, ముల్లోకముల హిత మును కోరునట్టి దేవి పూర్వ కాలమున దేవతలా
శరీరములలో నుండి ఉద్భవమొందిన విధమును ఇప్పుడు తెలిపితిని .
పునశ్చ గౌరీ దేహాసా సముద్ద్భూతాయథాభవత్ l
వధాయ దుష్ట దైత్యా న్యాం తథా శుమ్భనిశుమ్భ యో : ll 41
రక్షణాయచ లోకానాo దేవానాము పకారిణీ l
తచ్చ్రు ణుష్వమయా ఖ్యాతం యథావ త్కథ యామి తే ll 42
అర్థము :- (41
నుండి 42 శ్లో) మరల దేవతలకు ఉపకారిణి యై లోక
రక్షణార్థము దుష్ట దైత్యుతలను ,శుంభని శుంభులను,వధించుట కై ఆమె గౌరీ రూపమున ఉద్భవ మొందిన విధమును తెలిపెదను వినుము. అది యెట్లు జరిగెనో అట్లే నేను చెప్పెదను .
ఇతి మహాత్మ్యేశక్రాది స్తు తిర్నామ
చతుర్దోధ్యాయః
శ్రీ మార్కండేయ పురాణ మందలి సావర్ణి మన్వంతరమున
''దేవీ మాహా త్మ్యము '' లో ''శక్రాది స్తుతి '' అను పేరిటి
చతుర్దా ధ్యా యము సంపూర్ణము .
No comments:
Post a Comment