సప్త సంఖ్యా విశిష్టత
సప్త సంఖ్య సర్వ సిద్దులకును మూలము జపము గాని ,యజ్ఞము గాని యేడు రోజులు ఏకాగ్రతతో చేసినచో సిద్ది కలుగునని నారదుడు ద్రువునితో చెప్పెను . చిత్ర కేతువు ఏడు రోజులలో మంత్రము జపించి సిద్ది నొందెను. పరీక్షిత్తు నకు ఏడు రోజులలో మరణము కలుగునని శాపము. అతడు భాగవతము విన్నది ఏడు దినములు. ఏడు రోజులలో అతనికి జీవన పరమార్ధ సిద్ది కలుగ వలెను . అనగా మృత్యువును తరించి జన్మ రాహిత్య (అమృత ) సిద్ది కలుగ వలెను. అందుకే శుకుడు అతనికి విద్యా స్వరూపమైన భాగవతమును ఏడు రోజులలో వినిపించుట కారంభించెను ."విద్యయా మృత మశ్నుతే "( విద్య చేతనే అమృత త్వమును బొందును )అని శ్రుతి.
మన శరీరములో నున్నవి సప్త ధాతువులు మహత్తు ,అహంకారము పంచ భూతములతో గలిసి ఏడైనవి. శరీరము సాప్త దాతుకము ,సాప్త భౌతికము గూడ నైనది. అంతేకాదు "సప్త శీర్ష ణ్యా: ప్రాణాః సూర్యా ఇత్యా చార్యాః " అని శ్రుతి వాక్యము .అనగా ఇంద్రియములలో ప్రధానమైన రెండు కన్నులు ,రెండు ముక్కు రంద్రములు ,రెండు చెవులు ,ఒక నోరు అను ఏడును శిరస్సు నందుండు ప్రాణములనియు ,అవి సప్త భూతాత్మకము లైన సూర్యులే అనియు భావము ." సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయా న్నిహితా స్సప్త సప్త " అని ఉపనిషత్తు చెప్పును . అనగా భూర్బువస్సువరాది సప్త లోకముల లోను ప్రాణములు తిరుగు చుండు నట్లుగా భాగావానుడీ సప్త సంఖ్యలతో గూడిన పదార్ధములను సృష్టించేనని దీని యర్ధము.

భూలోకమనగా మూలాధారము ,భువర్లోకమనగా స్వాధిష్టానము , సువర్లోకము మణి పూరము ,మహార్లోకము
అనాహతము ,జనోలోకము
విశుద్దము , తపోలోకము
ఆజ్ఞా చక్రము ,సత్యలోకము
సహస్రారము .అనగా ఈ లోకములన్నియు మన శరీరములోనే యున్నవి. సహస్రరమును గూడ చేదించు కొని బిందు రూపమైన యమృత స్థానము
చేరినచో జీవునకు మోక్ష
సిద్ది కలుగును. వీనిని యోగరూపముగా భావించినచో యమ నియమాదులైన మొదటి యేడును సప్తలోకములను ,సప్త
చక్రములను అగును. చివరిదైన సమాధి యోగమే బిందు రూపమైన అమృత స్థానము .
గృహస్థాశ్రమమున ధన్యత చెందుటకు వేయు అడుగు లేడు.(సప్త పాదాలు) చైతన్య కారకుడైన సూర్యుని రధమును లాగెడి గుఱ్ఱము లేడు . భారతీయులమైన మనమా రాధించు అగ్నికి జ్వాల లేడు. జప తపో నిష్టలలో మన కాదర్శ పురుషులైన ఋషు లేడుగురు .లోతుగా ఆలోచించినచో మన జీవన యాత్రలో సప్త సంఖ్య యొక్క ప్రాధాన్యము అవగత మగును .జీవన యాత్రలో సప్త సంఖ్య యొక్క ప్రాధాన్యము అవగత మగును .జీవన యాత్రలో చివరి మజిలీకి కూడ ఏడు కట్ల వాహనమే గతి . సాధకుడైనవాడు ఏడు రోజులలో సప్త సంఖ్య గల అంతరములను దాటి అమృత స్థానము చేరుకొనును .అనగా సప్త సప్త పదార్ధములతో నిర్మింపబడిన దేహమందలి జీవుడు సప్త సంఖ్య తోనే సిద్ది నొందవలెను .
ఈ యభిప్రాయముతోనే శుక మహర్షి పరీక్షితునకు ఏడు రోజులలో సప్త భూమికలు దాటి అమృత స్థితికి చేరుటకై భాగవతమును భోదించుట కారంబించెను .

No comments:
Post a Comment