ధనుష్టంకారము యొక్కయు, సింహము యొక్కయు, ఘంటము యొక్కయు నాదములను వినబడకుండునట్లు చేసెను.
తం నినాదము పశ్రుత్య దైత్య సై న్యైశ్చ తుర్దిశమ్
దేవీ సింహాస్త థా కాళీ సరోషై: పరివారితాః 11
అర్ధము:(11వ శ్లో): ఆ
నాదమును విని అసుర సైన్యములు రోషముతో దేవిని, సింహమును, కాళిని నాలుగు దిక్కుల నుండి చుట్టుముట్టెను.
ఏత స్మిన్నన్త రే భూప వినాశాయ సుర ద్విషామ్
భవాయామర సింహానామతివీర్య బలన్వితా: 12
బ్రహ్మేశ గుహ విష్ణూనాం తథేన్ద్ర స్య చ శక్తయః
శరీరేభ్యో వినిష్క్రుమ్య తద్రూపై శ్చండి కాం యయు: 13
అర్ధము:(12 నుండి 13వ శ్లో): ఓ రాజా, ఆ సమయమున
సురవైరులను నాశిల్ల చేయుటకును, అమరేశ్వరుల శుభము
కొరకును బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్కయు కుమారస్వామి యొక్కయు ఇంద్రుని యొక్కయు శరీరములలో నుండి బాహుబల పరాక్రమములు
గల శక్తులు బయటకు వచ్చి ఆయా దేవతలా రూపముతో శక్తి దగ్గరకు వచ్చెను.
యస్య దేవస్య యద్రూపం యథా భాషణ వాహనమ్
తద్వ దేవ హితచ్చక్తి రసురాన్యోద్దు మాయయౌ 14
అర్ధము:(14వ శ్లో): ఏ దేవునిది ఏ రూపమో, అతని భూషణములును వాహనములును ఎవ్వియో, ఆ విధముననే అతని
శక్తి అసురులతో యుద్ధము చేయుటకు వచ్చెను.
హంసయుక్త విమానాగ్రే సాక్షా సూత్రక మండలు:
ఆయాటా బ్రహ్మణం శక్తి ర్బ్రహ్మణీ సాభి ధీయతే 15
అర్ధము:(15వ శ్లో): హంసలు
పూనిన విమానము ఎక్కి,
మాలా కమండలములతో బ్రహ్మ యొక్క శక్తి
వచ్చెను. ఆమె పేరు బ్రహ్మణి.
No comments:
Post a Comment