Friday, May 2, 2014

సర్వం శివమయం జగత్5





బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః
ప్రబల తమసే తత్సంహారే హరాయ నమోనమః
జన సుఖక్రుతే సత్త్వోద్రేకే మ్రుదాయ నమోనమః
ప్రమహసిపదే నిశ్రైగున్యే శివాయ నమోనమః
శివ మహిమ్న స్తోత్రం
సృష్టి చేయడానికి రజోగుణాన్ని ఆశ్రయించిన వాడు భవుడు (బ్రహ్మ) ప్రళయం చేయడానికి తమోగుణాన్ని ఆశ్రయించినవాడు హరుడు (మహేశ్వరుడు) రక్షించడానికి సుఖపెట్టడానికి సత్త్వగుణాన్నిఆశ్రయించిన మృడుడు (విష్ణువు) మహాతేజో రూపుడైన గుణాతీతుడై ఉండేవాడు శివుడు (పరబ్రహ్మ) విష్ణుః = అంతటా ఉండేవాడు. శివః = మంగళము ఇచ్చువాడు, సుఖము ఇచ్చువాడు. శర్వః = ప్రళయమున సర్వమును హింసించువాడు. గణేశః = ప్రమథ గణాలకు ప్రభువు ఈశః, ఈశ్వరః, మహేశ్వరః = అందరిని అన్నింటిని నియమించి అదుపులో ఉంచుకొనేవాడు. పరః = అందరికన్నా అన్నింటికన్నా ఉత్క్రుష్టుడైన వాడు. బ్రహ్మవిష్ణు మహేశ్వరుల కాధారుడు. రక్షించువాడు సత్యమైనవాడు........... అని ఎన్నో అర్ధాలున్నాయి  ఓంకారినికి.




No comments:

Post a Comment