Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము77




వైశంవీ సమరే చైనం చక్రేణాభి జఘన హ
గాదయా తాడ యామాస ఐన్ద్రీ తమ సురేశ్వరమ్     47
అర్ధము:(47వ శ్లో): ఆ అసురేశ్వరుని వైష్ణవి తన చక్రముతోను, ఐంద్రి తన గదతోను, యుద్ధమునందు కొట్టిరి.

వైష్ణవీ చక్ర భిన్నస్య రుధి రస్రావ సమ్భవై:
సహస్రశో జగద్వ్యాప్తం తత్ప్ర మాణైర్మహసురై :     48
అర్ధము:(48వ శ్లో): వైష్ణవి యొక్క చక్రముచే చీలచబడినప్పుడు కారిన రక్తము నుండి పుట్టిన అతని ప్రమాణములుగల మహాసుర సాహస్రముతో జగత్తు నిండిపోయెను.

శక్త్యా జఘాన కౌమారీ వారాహీ చ త థాసినా
మహేశ్వరీ త్రిశూలే న రక్త బీజం మహాసురమ్       49
అర్ధము:(49వ శ్లో): కౌమారి భల్లముతోను, వారాహి ఖడ్గముతోను, మహేశ్వరి త్రిశూలముతోను, రక్త బీజమహాసురుని కొట్టిరి.

స చా పి గదయా దైత్యః సర్వా ఏవాహనత్ పృథక్
మాత్రూ: కో పసమావిష్టో రక్త బీజో మహాసురః       50
అర్ధము:(50వ శ్లో): రక్త బీజమహాసురుడును కోపావేశ పరిపూర్ణుడై ఆ మాత్రుకలను అందరను తన గదతో గాఢముగా కొట్టెను.

తస్యాహత స్య బహుధా శక్తి శూలాది భిర్భువి
పపాత యో వైరక్తౌ ఘస్తే నా సచ్చా తశో సురాః     51
అర్ధము:(51వ శ్లో):శక్తి శూలదులగు ఆయుధములవలన అతనికి కలిగిన పెక్కు గాయములనుండి భూమిపై పడ్డ రక్త - సమూహమునుండి నూర్ల కొలది అసురులు ఉద్భవించిరి.

తైశ్చాసురా సృక్సమ్భూ తైర సురై: సకలం జగత్
వ్యాప్త మాసీత్త తో దేవా భయమా జగ్మురుత్తమమ్    52
అర్ధము:(52వ శ్లో): ఆ రక్కసుని రక్తము నుండి ఉద్భవించిన అసురులు జగత్తునందు అంతటను వ్యాపించిరి. అందుచే దేవతలు మహాభీతి చెందిరి.

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

 

No comments:

Post a Comment