మహేశ్వరీ వృషారూడా త్రిశూల వరధారిణీ
మహాహివలయా ప్రాప్తా చంద్రరేఖా విభూషణా 16
అర్ధము:(16వ శ్లో): ఎద్దును ఎక్కి ఉత్తమమగు త్రిశూలము ధరించి, పెద్ద సర్పములు గాజులుగా కలిగి, చంద్రరేఖ
విభూషణముగా దాల్చి మహేశ్వరి వచ్చెను.
కౌమారీ శక్తి హస్తా చ మయోఒర వరవాహనా
యోద్ధుమభ్యాయయౌ దైత్యాన మ్బికా గుహరూపిణీ 17
అర్ధము: (17వ శ్లో): చేత
భల్లమును దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపముతో అంబికా కౌమారి దైత్యులతో యుద్ధము చేయుటకు వచ్చెను.
తథైవ వైష్ణవీ శక్తి ర్గ రుడో పరి సంస్థితా
ఖ చక్ర గదాశార్ జ్గ ఖడ్గ హస్తా భ్యుపాయ యౌ 18
అర్ధము :(18వ శ్లో): అట్లే
విష్ణుశక్తియు, గరుడుని ఎక్కి శంఖము, చక్రము, గద,
శార్ జ్గము (ధనుస్సు), ఖడ్గము, చేతులందు ధరించి
వచ్చెను.
యజ్న వారాహమతులం రూపం యా బిభ్రతో హరే:
శక్తి: సప్యాయ యౌ తత్ర వారాహీం బిభ్రతీ తనుమ్ 19
అర్ధము:(19వ శ్లో): అసమాన
మగు యజ్ఞ వరాహరూపమును దాల్చిన హరియొక్క శక్తి, వారాహి కూడా అచటికి వచ్చెను.
నారసింహీ నృసింహస్య బిభ్రతీ సదృశం వపు:
ప్రాప్తా తత్ర సటాక్షే పక్షిప్త నక్షత్ర సంహతి: 20
అర్ధము:(20వ శ్లో): నారసింహి అచటికి నరసింహ (నరరూప సింహరూపములు కలసిన)
రూపముతో, నక్షత్ర మండలములు దొర్లి పడునట్లు జూలు విదుల్చుచు అచటికి
వచ్చెను.
వజ్రహస్తా త థై వైన్ద్రీ గజరాజో పరిస్థితా
ప్రాప్తా సహస్రనయనా యథా శక్ర స్త థైవసా 21
అర్ధము:(21వ శ్లో): అట్లే
వేయి కన్నులు గల ఐంద్రియు ఇంద్రుని వలెనే వజ్రాయుధమును చేతబూని శ్రేష్టమగు ఏనుగు
పై ఎక్కి వచ్చెను.
No comments:
Post a Comment