Wednesday, May 21, 2014

శివ గీత66




శ్రీరామ  ఉవాచ :-
భగవన్ కుత్ర జీవోసౌ జంతో ర్దే హేవ తిష్టతే
జాయతే నా కుతో జీవః - స్వరూపం వాస్య కిం వద         1
దేహాంతే నా కుత్ర యాతి - గత్వా నాకుత్ర తిష్టతి  
కథ మాయాతి నా దేహం - పునర్నాయాతి నా వద              2

సాధు పృష్టం మహాభాగ ! గుహ్య ద్గుహ్యత రం హియ త్
దే వైరపి సుదుర్జే  య  - మింద్రా ద్యైర్యా మహర్షి భి:               3

అన్యస్యై నైవ వక్తవ్యం - మయాపి రఘునందన !
త్వద్భ క్త్యా హం పరం ప్రీతో - వ్య క్ష్యా మ్య వ హిత శ్రుణు           4

సత్య జ్ఞానాత్మ కో నంతః - పరమానంద విగ్రహః
పరమాత్మా పరంజ్యోతి - రావ్యక్తో వ్యక్త కారణమ్                        5

శరీర స్వరూపమును తెలిసికొని జీవుని గురించి విషయమును
 తెలిసికొనుటకై రాముడు పునఃప్రశ్నించు చున్నాడు.
ఓయీ భగవంతుడా! మహిమగల ఈ దేహమందు పరోక్షుడ
(కనులకు అగుపడని)గు జీవుడుంటున్నాడా? జన్మించుచున్నడా?
 జీవుడను పేరేట్లు వచ్చినది? ఈ జీవత్వమనునది స్వాభివికమా?
 అజ్ఞానముతో కూడియున్నదా? జీవుని స్వరూపమెటువంటిది ?
 అది జ్ఞానాత్మకమా ? తద్విరుద్ధమా?
 దేహ స్వరూపమును గురించి యెట్లు వచ్చును? లేదా రాదా?
అదంతయూ సవిస్తారముగా నాకు బోధించుమనెను.       

శ్రీ భగవంతుడుపదేశించెను:- మిగుల రహస్యమగు నిది యింద్రాది
దేవతలా చేతను కూడా తెలియదగినది కాదు.
 నీ యందలి భక్తీ చేత ప్రసన్నుండనై చెప్పుచున్నాను.
 అవధాన మనస్కుండవై వినుము. దీనిని పరవారలకు తెలుపతగదు.
ప్రిబింబరూపుడగు జీవుని స్వరూపమును తెలిసికొనుటకు మొట్టమొదట
 బింబరూపగు పరమేశ్వర జ్ఞానమును గురించి తప్పకుండా తెలిసికొని
 బింబమానము నాదేశించుచున్నాడను.        

నిత్యో నిశుద్ధ స్సర్వాత్మా - నిర్లేపో హం నిరంజనః
సర్వధర్మ విహీనశ్చ - న గ్రాహ్యొ మనసా పిచ          6

నాహం సర్వేంద్రి య గ్రాహ్యః సర్వేషాం గ్రాహాకో హ్యహమ్
జ్ఞాతామం సర్వలోకస్య - మను జ్ఞాతాన విద్య తే        7


First   60   61   62  63   64   65  66  67   68   69  70  71    Last

No comments:

Post a Comment