Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము73




తతః పరివృతస్తా భిరీ శానో దేవశక్తి భి:
హన్యన్తామ సురాః శీఘ్రం మమ ప్రీత్యాహ చండికామ్   22
అర్ధము:( 22వ శ్లో): అంతట శివుడు, ఈ దేవశాక్తులు తన్ను పరివేష్టించి యుండ, (అచటికి వచ్చి) " నా ప్రీతికొరకై అసురులు శీఘ్రముగా నీచేత చంపబడుదురు గాక" అని చండికతో చెప్పెను.

తతో దేవీ శరీరాత్తు వినిష్క్రాంతా తిభీషణా
చండికా శక్తి రుత్యగ్రా శివాశత నినాదినీ      23
అర్ధము: (23వ శ్లో): అంతట అత్యంత భయంకరయు, మిక్కిలి ఉగ్రరూపయు అగు చండికా శక్తి వేయి నక్కలవలె అరచుచు దేవి శరీరములో నుండి వెలువడెను.

సా చా హ ధూమ్రజటి లమీశాన మపరాజితా
దూత స్త్వం గచ్చ భగవన్పార్స్వం శుమ్భ నిశుమ్భయో:   24
అర్ధము:( 24వ శ్లో): ఓటమి ఎరుగని ఆ (పార్వతీ) దేవీ ధూమ (పొగ) వర్ణపు జడలుగల శివునితో ఇట్లు చెప్పెను. "ప్రభూ, శుంభ నిశుంభుల యొద్దకు నీవు దూతగా వెళ్ళుము.

బ్రూహిశుమ్భం నిశుమ్భం చ దానవావ తిగర్వితౌ
ఏ చాన్యే దానావాస్తత్ర యుద్ధాయ సముపస్థితాః     25
అర్ధము:(25వ శ్లో): "మిక్కిలి పొగరుబోతులగు ఆ శుంభ నిశుంభాసురులతోను, యుద్ధము చేయుటకై అచట చేరియుండు ఇతర దానవులతోనూ, ఇట్లు చెప్పుము:

త్రైలోక్యమిన్ద్రో లభతాం దేవాః సన్తు హవిర్భుజః
యూయం ప్రయాత పాతాళం యది జీవితుమిచ్చ థ        26
అర్ధము:(26వ శ్లో): మూడు లోకములను ఇంద్రునికిని, హవిర్భాగములు దేవతలకును, లభించుగాక. బ్రతికి యుండాలని కోరుకుంటే పాతాళమునకు వెళ్ళమను.

బలావలే పాదథ చేద్భవన్తో యుద్ద కాణః
తదాగచ్చత త్రుప్యన్తు మచ్చివాః పిశితే నవః  27
అర్ధము:(27వ శ్లో): "లేక బలగర్వముచేత యుద్ధము  చేయ కోరుతున్నారా, రండి నా నక్కలు మీ మాంసము తిని తృప్తి నొందుగాక." 

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

 

No comments:

Post a Comment