Friday, May 2, 2014

మహాపురాణాల సంక్షిప్తవివరణ5




6 . నారద పురాణము: ఈ పురాణంలో రెండు భాగాలున్నాయి. పూర్వభాగం 125  అధ్యాయాలు, ఉత్తరభాగం 82 అధ్యాయాలు మొత్తం 25000 ఆలో కాలు. ఇందు విష్ణు పార మ్యత్వాన్ని బోధించే పురాణం. ఇందులో బౌద్ద నింద అత్యద్ కంగా కనబడుతుంది. ఈ పురాణమందు కూడా వ్యాకరణ-నిరుక్త-జ్యోతిష- ఛంద: శాస్త్రాదులకు సంబంధించిన విషయాలు చెప్పబడినవి.

7 . మార్కండే య పురాణము: ఈ పురాణంలో 137 అధ్యాయాలు, 9000 శ్లో కాలు ఉన్నాయి. ప్రసిద్ద మైన 'దుర్గా సప్త శతి' ఈ పురాణంలో నే ఉన్నది.

8 . అగ్ని పురాణము: ఈ పురాణం ప్రాచీన భారతీ య విద్యా సర్వస్వం అని చెప్పవచ్చు. ఆవ తారాలను గూర్చి సంక్షిప్తంగా ఇందు చెప్పబడింది. అలాగే రామాయణ, భారత కథలు విపులంగా చెప్పబడి నవి. దేవాలయ నిర్మాణము,మూర్తి ప్రతిష్ట, పూజా విధానము అతి విపులంగా విశ దీ కరింప బడినది. ఈ పురాణంలో జ్యోతిశ్శస్తం, ధర్మ శాస్త్రం, శిక్ష, రజనీ తి మొ||గు వానిని గూర్చి విశది కరింప బడినవి. యోగము గూర్చియూ ఇందు తెలుపబడినది. ప్రధానమైన విద్యలను జన సామాన్యానికి అంద జేయడం పురాణాల ద్యేయం. ఇందులో అగ్ని పురణానిది అగ్రస్ధానం.

9 . భవిష్య పురాణము : ఇది ప్రాచీన పురాణము. దీ నిని గూర్చి నారద, మత్స్య పురాణములు ఉటంకించినవి. ఇందులో ఇంద్రజీ అనే పేరుతో ఇంగ్ల షువారు భారత దేశానికి వచ్చుటను గూర్చి వివరించ బడినది. బ్రహ్మ, విష్ణ, శివ, సూర్య, అనే నాలుగు పర్వాలు 1400 శ్లో కాలు ఉన్నాయి.


 First  2  3  4  5  6  7  8  Last


No comments:

Post a Comment