Thursday, May 22, 2014

శివ గీత 67




దూర స్సర్వ వికారాణాం - పరిణామాది కస్య చ
యతో నాచో నివర్తం తే - అప్రా ప్య మనసా సహా       8

ఆనందం బ్రహ్మ మాం జ్ఞాత్వా - న బిభే తి కుత శ్చన,
యస్తు సర్వాణి భూతాని - మయ్యే వేతి ప్రపశ్య తి           9

మాం చ సర్వేషు భూతేషు - తతో న విజుగుప్సతే
యస్య సర్వాణి భూతాని - హ్య త్త్యే వాభూద్వి  జానతః    10

నేను శాశ్వతుడను, నిర్మలుండును,
అందరి యంతరంగమున నున్నవాడిని, సమస్త స్వరూపుడను.
 వృద్ధి బొందువాడిని, క్రియా శూన్యుడను,
సర్వధర్మ రహితుడను మనస్సున కగోచరుడను.
 సమస్తేంద్రియములతో నగ్రాహ్యుడను, సర్వమును గ్రహించువాడిని,
 సర్వలోకములకు తెలిసికొన్న వాడిని,
నన్నెవరును తెలియని (గుర్తించని) వాడిని, పరిణామాది వికార రహితుడను,
 నన్ను వివరించుటలో నే వేదములైతే మనస్సుతో కూడా గుర్తించ
లేక మౌనమును వహించునో అటువంటి యానందమయుడ
 నగు  పరబ్రహ్మనైన నన్ను తెలిసికొనిన వాడెక్కడను భీతిల్లడు.
సమస్త ప్రాణులు నాయందే యున్నవని మదాత్మగాదలచునో
 నన్నన్ని ప్రాణులయందు వానినిగా నేవ్వడైతే తెలిసికొనునో అట్టివాడు
 సమస్త ప్రాణులనుండి తనను రక్షించు కొనదలచినవాడు కాడు.
 సమస్త ప్రాణులు నా పరమాత్మయేనని తెలిసికొనునట్టి ఐక్యమునే
 చూచునట్టి వాడికి మొహశోకము లెట్లు కలుగును?

కో మొహస్తత్ర కస్శోక - ఏకత్వ మను పశ్యతః
ఏష సర్వేషు భూతేషు - గూడో త్మా న ప్రకాశతే       11

దృశ్యతే త్వగ్ర్య యా బుద్ధ్యా - సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి:
అనాద్య విద్యయా యుక్త - స్తథాప్యేకో హ మన్యయః            12

అవ్యాకృత   బ్రహ్మరూపో - జగత్కర్తా మహాస్త్రశ్వరః
జ్ఞానమాత్రే యథా దృశ్య - మిదం స్వప్నే జగత్త్రయమ్           13

తద్వన్మయి జగత్సర్వం - దృశ్యతే స్తి విలీయతే   
నానావిద్యా సమాయుక్తో - జీవత్వేన వసామ్యహమ్            14

పంచ కర్మేంద్రి యాణ్యే వ - పంచ జ్ఞానేంద్రి యాణి చ,
మనో బుద్ధి రహంకార - శ్చిత్తం చేత చతుష్టయమ్               15

First   60   61   62  63   64   65  66  67   68   69  70  71    Last

No comments:

Post a Comment