Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము62




తస్య దూత స్య తద్వాక్య మాకర్ణ్యా సుర రాట్ తతః |
సక్రోధం ప్రాహ దైత్యా నా మది పం ధూమ్ర లోచనమ్|| 3
హే ధూమ్ర లోచనాశుత్వం స్వసైన్య పరి వారితః |
తామనయ బలాద్దుష్టాం కేశాకర్షణ విహ్వలాం || 4
అర్ధము :(3 నుండి 4 వ శ్లో ) అంతట దూత చెప్పిన ఆ మాటలను విని అసురరాజు మిక్కిలి కోపము నొంది దూత్యాది పుడగు ధూమ్ర లోచనునితో ఇట్లు చెప్పెను: " ఓ ధూమ్ర లోచనా, నీవు నీ సైన్య సమేతుడవై త్వరితముగా వెళ్లి ఆ దుష్టురాలిని బలాత్కారముగా వెండ్రుకలు పట్టుకుని లాగి, భయముచే శరీరము స్వాధీనము తప్పు నట్లు ఇచ్చటికి తీసుకుని రమ్ము.

తత్పరి త్రాణదః కశ్చి ద్యది వోత్తిష్టతే పరః|
సహన్త వ్యోమరో వాపి యక్షో గన్దర్వ ఎవవా|| 5
అర్ధము: (5 వ శ్లో ) "ఇతరుడు ఎవడైనను ఆమెను రక్షించుట కై నిలువబడినచో వాడు వెలుపైనను, యక్షకుడైనను, గందర్వు డైనను, వానిని చంపుము.”

ఋషి రువాచ || 6
తేనాజ్ఞ ప్త స్తతః శీఘ్రం స దైత్యో దూమ్రలోచనః |
వృతః షష్ట్యా సహస్రాణా మ సురాణాం ద్రుతం యయౌ || 7
అర్ధము ;(6 నుండి 7 వ శ్లో ) ఋషి పలికెను: శుంభునిచే ఇట్లు ఆజ్ఞాపించ బడి ఆ దైత్యుడు, దూమ్రలోచనుడు, అంతట అరువది వేల మంది అసురులతో కూడి శీఘ్రముగా బయలు దేరెను.

సద్రుష్ట్వా తాం తతో దేవీం తుమినాచల సంస్థితామ్|
జగాదో చ్చై: ప్రయాహీతి మూలం శుమ్భ నిశుమ్భ యో:|| 8
అర్ధము: (8 వ శ్లో ) మంచుకొండ పై కూర్చుండి యుండిన ఆ దేవిని చూచి, "శుంభు నిశుంభుల యొద్దకు రమ్ము " అని గట్టిగా అరచి చెప్పెను.

న చేత్ప్రీ త్యా ద్య భవతీ మద్భ ర్తారము పైష్యతి|
తతో బలాన్న యామ్యేష కేశాకర్షణ విహ్వలామ్ || 9
అర్ధము (9 వ శ్లో ) " నీవిపుడు నా ప్రభువు కడకు ప్రీతితో రావేని, నిన్ను బలాత్కారముగా వెండ్రుకలు పట్టుకుని ఈడ్చి, భయముచే నీ శరీరము స్వాధీనము తప్పునట్లు, తీసుకుని పోయెదను.

 

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

No comments:

Post a Comment