"గంగను దెచ్చి వారి బూడిదలపై ప్రవహింప జేసినచో వారికి మంచి గతులు
గలుగు "నని చెప్పిరి.
అంశు మంతుడు తన కుమారుడు దిలీపునకు రాజ్యాభిషేకము చేసి తపము చేయుటకు హిమాలయములకు వెళ్ళెను .కాని అతని తపము సిద్ది నొందలేదు
. తరువాత దిలీపుడు
గంగను స్వర్గ లోకము నుండి దించుటకు యత్నించెను. కాని అతనికి కూడా సాధ్యము కాక పోయెను. ఆ తరువాత భగీరధుడు గంగను గూర్చి మహాతపము
చేసెను,ఆమె ప్రత్యక్షమై
,"నేను భూమికి దిగుచున్నపుడు ఆ ధాటికి భూమి తట్టు కొనలేదు . శివుని ప్రార్దింపుము .అతడు నన్ను భరింప గలడు." అని
చెప్పగా భగీరధుడు శివుని
ప్రార్ధించెను . అతడంగీక రింపగా గంగ అతని జటా జూటములోనికి దూకి ,హిమాలయములపై బడి ,చాలాదూరము
ప్రవహించి సగర కుమారులు త్రవ్విన మహా గర్తము (గొయ్యి )
ను పూరించి పాతాళమునకు దిగి ,సగర
కుమారుల చితా భస్మముల మీదుగా ప్రవహించెను.
దానితో సగర కుమారులు తరించిరి . వారు త్రవ్విన గోతిని పూరించుట చేత సముద్రము సాగరమని పిలువబడెను.
గోకర్ణ క్షేత్రము
భారత దేశమునకు దక్షిణ భాగమున గోకర్ణ మను పుణ్య క్షేత్ర మొకటి కలదు .అది పరమేశ్వరుడు ప్రీతితో నివసించిన ప్రదేశము .అచట చేసిన యే దానమైనను ,ధర్మమైనను,తపమైనను, జపమైనను కోటి గుణితమైన ఫలము నిచ్చును .అచట మరణించిన వారికి మోక్షము అరచేతి లోని అరటిపండు స్నానము చేసి అక్కడ వెలసిన గోకర్ణేశ్వరునికి జపాభిషేక హోమములు చేసిన వారికి కోరిన సిద్దులు లభించును .
అటువంటి మహా పుణ్య క్షేత్రములో మహర్షులు నివసించుచు ,నిత్యమును గోకర్ణేశ్వరుని సేవించు చుందురు. ఆ పుణ్య క్షేత్రము ,సముద్రము ఆకాశ గంగతో నిండుట తో నీళ్ళలో మునిగి పోయెను .మహర్షులు చింతా క్రాంతులై ,ఆలోచించి పరశురాముడు ఈ క్షేత్రమును వెలికి తీయగల సమర్ధుడని భావించి అతని యొద్దకు బోయి ,తమకు గలిగిన దురవస్తను చెప్పుకొనిరి .వెంటనే పరశురాముడు దక్షిణ సముద్ర తీరమునకు వచ్చి, సముద్రిని ,గోకర్ణ క్షేత్రమును వెలువరింపుమని అనేక విధముల ప్రార్ధించెను. సముద్రుడు సమాధాన మీయలేదు. దానికి కోపించి భార్గవ రాముడు ఆగ్నేయాస్త్రమును వింట సంధించెను . అతని కోపమునకు భయపడి సముద్రుడు మానవ రూపముతో వచ్చి "ఓ భార్గవ రామా ! నీ పరాక్రమమును నే నెరుగుదును .బ్రహ్మ మునుపు నాకు "నిన్నెవ్వరును పరాక్రమము చూసి వెనుకకు గెంటి వేయలేరు ."అని వరము నిచ్చెను .కాని విష్ణువు వంశము కలిగిన నీ యాజ్ఞను అతిక్రమించుట నాకు సాధ్యము గాదు. కావున నీ మేరకు నన్ను జరిగి వెనుకకు పొమ్మందువో చెప్పుము ,అట్లే చేసెదను."అనగా పరశురాముడు "గోకర్ణ క్షేత్రము బయట పడునట్లు నాలుగు వందల యోజనముల దూరము వెనుకకు జరిగి యీ మునులందరును నివసించుటకు చోటిమ్ము " అని చెప్పగా
సముద్రుడు అట్లే వెనుకకు జరిగెను. గోకర్ణ క్షేత్రము నీటి నుండి బయట పడెను. మునులందరును పరశురాముని వేయినోళ్ళ గొని యాడిరి. పరశురాముడు గోకర్ణే శ్వరుని భక్తితో ఆరాధించి తిరిగి మహేంద్ర పర్వతమునకు జేరెను .
First 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 Last

No comments:
Post a Comment