Thursday, May 1, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam45




త్రైలోక్యమేతం దఖిలంరి పునాశ నేన
త్రాతం త్వయా సమరమూర్ధ ని తే పి హత్వా
నీ తా ది వం రి పుగణా భయమప్య పాస్తః
మస్మాక మున్మద సురారి భవం నమస్తే        23
అర్ధము: (23వ శ్లో): 'వైరులను వినాశమొనర్చి నీవు ఈ మూడు లోకములను రక్షించితివి. యుద్ధ భూమిలో వధించి ఆ శత్రుగణములను కూడా స్వర్గమునకు కొనిపోయితివి. మదొన్మత్తులగు సురవైరులవలని భయము మాకు తొలగించితివి. నీకు ప్రణామములు.

శూలేన పాహి దేవి పాహి ఖడ్గే ణ చామ్బికే
న్డాస్వనేన నః పాహి చాపజ్యానిస్స్వనేన చ      24
అర్ధము:(24వ శ్లో): "దేవీ, నీ శూలముతో మమ్ము రక్షింపుము. అంబికా, నీ ఖడ్గముతో మమ్ము కాపాడుము. నీ ఘంటానాదముతో మమ్ము కావుము; నీ వింటి టంకార ధ్వనితో మమ్ము పాలింపుము.

ప్రాచ్యాం రక్షా ప్రతీచ్యాం చ చండీ కే రక్ష దక్షిణే
భ్రామణే నాత్మ శూలస్య ఉత్తర స్యాం తథేశ్వరి     25
అర్ధము: (25వ శ్లో): "చండికా తూరుపునకు, పడమటను, దక్షినమునను, ఉత్తరమునను నీ శూలమును త్రిప్పుచు మమ్ము, ఈశ్వరీ కాపాడుచుండుము.

సౌమ్యాని యాని రూపాణి త్ర్యైలోక్యే విచరంతి తే
యాని చాత్యన్త ఘోరాణి తైరక్షాస్మాం స్తథా భువమ్ 26
అర్ధము: (26వ శ్లో): " ముల్లోకములందు సంచరించుచుండు నీ యీ సౌమ్యరూపములతోను, అత్యంత ఘోర రూపములతోను, మమ్మును, భూలోకమును రక్షింపుము.

ఖడ్గ శూలగ దాదీ ని యాని చాస్త్రాణి తే మ్బికే
కర పల్లవ సజ్గినీ తైర స్మాన్రక్ష సర్వతః
అర్ధము:(27వ శ్లో): "అంబికా, నీ ఖడ్గ శూలగ దాడులను ఆయుధములు - నీ కర పల్లవములను ఏ యే ఆయుధములను స్ప్రుశించెనో ఆ ఆయుధము లన్నిటితోనూ, మమ్ము సర్వదిశలందును రక్షింపుము"

 First   40  41   42  43  44  45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61   Last

 

No comments:

Post a Comment