Thursday, May 1, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam49




హృతాధ్ కారాస్త్రిద శాస్తాభ్యాం సర్వే నిరక్రుతా: l
మహా సురా భ్యాం తాం దేవీం సంస్మరన్త్య పరాజితామ్ l l 5
అర్ధము : (5 వ శ్లో) ఆ ఇరువురు మహా సురులు తమ అధికరములను హరించి తరమ గొట్టుట చే దేవత లందరును అపరాజిత (గెలువ బడినది) అగు దేవిని సంస్మరించిరి.

దేవీ మహత్యం 43
తయా స్మాకం వరో దత్తో యథ్రూ పత్సు స్మ తా ఖిలా : l
భవతాం నాశయిష్యామిత  క్షణాత్పర మా పద : l l 6
అర్ధము :(6 వ శ్లో) ''ఆపద లందు నన్ను మీరు స్మరించునప్పుడెల్ల, తక్షణమునే మీ ఘోర విపత్తులను అన్నింటిని నేను అంత మొందింతును'' అని ఆమె మాకు వరము ఇచ్చియున్నది.

ఇతి కృత్వా మతిం దేవాహి మా వస్తం నగెశ్వరమ్ l
జగ్ముస్తత్ర తతో దేవీం విష్ణు మాయాం ప్రతుష్టువు : l l 7
అర్ధము : ( 7 వ శ్లో) ఇట్లు నిశ్చ యిం చు కొని దేవతలు  పర్వత సార్వభౌముడగు హిమ వంతు నియొద్దకు పోయి, అచట విష్ణు మాయ యగు దేవినిస్తుతించిరి.

దేవా ఊచు : l l 8
నమో దేవ్యై మహా దేవ్యై శివాయై సతతం నమః l
నమః ప్రకృత్యై భద్రా యై నియతా : ప్రణతా : స్మతామ్ l l 9
అర్ధము : (8 నుండి 9  శ్లో) దేవతలు పలికిరి :'' దేవికి , మహాదేవి కి, నమస్కృతులు,నిత్య శుభంకరి యగు ఆమెకు ఎల్లప్పుడును  నమస్కృతులు. మూల ప్రకృతియు , రక్షాశక్తి యు అగు ఆమెకు నమస్కృతులు. నియత చిత్తుల మై మేము ఆమెకు ప్రణ మిల్లుచున్నాము .

రౌద్రాయైనమో నిత్యా యై గౌర్యైధాత్ర్యైన మోనమః l
జ్యోత్స్నాయై చేందు రూపిన్య్యై సుఖా యై సతతం నమః l l 10
అర్ధము :(10 వ శ్లో ) '' భయంకరికి నమస్సులు ; శాశ్వతకు, గౌరీ కి , (జగత్) పోషకు రాలికి  నమస్సులు ; కౌముది (వెన్నెల) రూపకు , చంద్రూకు , సుఖ రూపకు సర్వదా నమస్కృతులు .

 First   40  41   42  43  44  45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61   Last

No comments:

Post a Comment