పలాయన పరాన్ద్రష్ట్వా దైత్యాన్మాతృ గణార్దితా
యెద్దుమభ్యాయయౌ క్రుద్దో రక్త బీజో మహాసురః 40
అర్ధము:(40వ శ్లో):
మాత్రుగణముచే పీడింపబడి దైత్యులు పారిపోవుటను చూచి రక్త బీజమహాసురుడు కుపితుడై
యుద్ధము చేయుటకై ముందుకు వచ్చెను.
రక్త బిన్దుర్యదా భూమౌ పతత్య స్య శరీరతః
సాముత్పతతి మేదిన్యాం తత్ప్రమాణస్త దాసురః 41
అర్ధము:(41వ శ్లో): అతని
శరీరమునుండి రక్త బిందువు భూమిపై పడినప్పుడెల్ల అతని యంతటి అసురు డొకడు భూమి నుండి
లేచుచుండెను.
యుయుధే సాగదాపాణి రిన్ద్ర శక్త్యా మహాసుర:
తత శ్చైన్ద్రీ స్వవ జ్రేణ రక్త బీమతా డయత్ 42
అర్ధము:(42వ శ్లో): ఆ
మహాసురుడు గదాహస్తుడై ఇంద్రాణితో పోరాడెను. ఆమెయు అంతట తన వజ్రాయుధముతో అతనిని
కొట్టెను.
కులిశే నా హత స్యాశు బహు సుస్రావ శోణితమ్
సముత్త స్థుస్తతో యోదాస్త ద్రూపా స్త త్పరాక్రమాః 43
అర్ధము:(43వ శ్లో): వజ్రాయుధపు దెబ్బవలన అతనిలో నుండి వెంటనే రక్తము
అతిశయముగా కారెను. ఆ రక్తములో నుండి
అతని రూపమును, అతని పరాక్రమమును గల యుద్ధ వీరులు ఉత్పత్తి యగుచుండిరి.
యావన్తః పతితాస్త స్య శరీరాద్రక్త బిన్దవః
తావన్తః పురుషా జాతాస్త ద్వీర్య బలవిక్రమాః 44
అర్ధము:(44వ శ్లో): అతని శరీరమునుండి ఎన్ని రక్త బిందువులు నేలపై పడునో
అంతమంది పురుషులు, బలసాహస
పరాక్రమములందు అతనివంటివారు, పుట్టుచుండిరి.
తే చాపి యుయుధు స్తత్ర పురుషా రక్త సంభవాః
సమం మాత్రుభి రత్యుగ్ర శస్త్ర పాతాతిభీ షణమ్
45
అర్ధము:(45వ శ్లో): అతని రక్తము నుండి ఉత్పత్తియైన పురుషులు కూడా మాతృకలతో
సమానముగా, అతిభీషణముగా అత్యుగ్రశస్త్రములు ప్రయోగించుచు పోరాడిరి.
పునశ్చ వజ్రపాతే న క్షతమస్య శిరో యదా
వవాహ రక్తం పురుషాస్తతో జాతాః సహస్రశః
46
అర్ధము:(46వ శ్లో): మరల ఆమె వజ్రాయుధపు తాకుడుచే అతని శిరస్సు గాయపరుపబడి
అతని రక్తము ప్రవహింపగా, ఆ రక్తములో నుండి
వేలకొలది పురుషులు పుట్టిరి.
No comments:
Post a Comment