Tuesday, May 20, 2014

శివ గీత 62




తనాభి కందే వృపణయో - రూరుజాను షు తిష్టతి
తస్య మూత్ర పురీషాది - విసర్గః కర్మ కీర్తితమ్               30

(ఇక వాయుదశకము యొక్క స్థానములను
 అవి చేయు క్రియల వివరణము)
పది వాయువులతో ప్రాణవాయువు ప్రధానమైనది.
 ఇది నాభి మొదల్కొని కంటము వరకు దాని సంచార స్థానము –
 నాసా రంధ్రముల ద్వారా హృదయ పద్మము నందును నాభి
 యందును ప్రవేశించి తిరుగుచుండును.
 శబ్దోచ్చార నహు ఉచ్చ్వాస నిశ్వాసములకీ వాయువే ముఖ్య కారణమైనది.
గుదము నందును, శిశన మందును, కటి యందును, పిక్కల యందును,
 కడుపు నందును, నాభి కందమునందును, గజ్జ లందును, తొడ లందును,
ముంచేతులతోను నుండునది అపాన వాయువు.
 మూత్ర పురీష విసర్జన చేయుట దీని క్రియ.

వ్యానోక్షి శ్రోత్ర గుల్పేషు - జిహ్వ ఘ్రాణే షు తిష్టతి
ప్రాణాయా మధ్రు తిత్యాగ - గ్రహణా ద్య స్య కర్మచ            31

సమానో వ్యాప్య నిఖిలం - శరీరం వహ్నినా సమ
ద్విసప్త తి సహస్రేషు - నాదీ రంధ్రే షు సంచర న్              32

భుక్త పీత రసా న్సమ్య - గానయన్ దేహ పుష్టి కృత్,
ఉదానః పాసయోరాస్తే - హస్త యో రంగ సందీషు           33

కర్మాస్య దే హొ న్నయనో  - త్క్రమణాది ప్రకీర్తిత మ్
త్వగాడి ద్రూతూ నాశ్రిత్య  - పంచ నాగాద య స్స్థితా           34

ఉద్గారాది నిమేషాది క్షుత్పిపాసాది క క్రమాత్
తంద్రీ ప్రకృతి శోకాది - తేషాం  కర్మ  ప్రకీర్తితమ్       35  

(వ్యానము యొక్క స్థానము కరమను చెప్పుచున్నాడు)
చక్షు: శ్రోత్ జిహ్వ ఘ్రాణములందును,
గుల్ఫ ములందును ఉండునది వయానవాయువు,
దాని పని రేచక - పూరక - కుంభకములు,
సమాన వాయువు అగ్నితో కూడి శరీర మంతట వ్యాపించి
 డెబ్బది రెండువేల నాడుల రంధ్రములందును సంచరించుచుండును.
 తినిన ఆహారము యొక్క మరియు త్రావబడిన రసపాదార్ధముల
యొక్క సారమును గైకొని శరీర పుష్టిని క్రమ పద్ధతిలో నుంచును.
ఉదాన వాయువు కరచరణముల యొక్క సందులందుండును,
 ఉదాన వాయువు కర్తవ్యకర్మ యేమనగా శరీరమును లేవనెత్తుట,
 ఉత్క్రమణము మొదలగునవి.
ఇకపోతే ఉపానవాయువులగు నాగాదుల స్థితిని దెల్పును,


First   60   61   62  63   64   65  66  67   68   69  70  71    Last

No comments:

Post a Comment