Thursday, May 1, 2014

దేవీ మహాత్మ్యము Devi Mahatmyam48




ఉత్తమ చరితము
మహా సరస్వతీ ధ్యానము

ఘణ్నాశూల హలానిశజ్ఞ ము సలే చక్రం ధను: సాయకం
హస్తా భ్జ్ఞైర్ధతీంఘ నాస్త విల సచ్చీతాంశు తుల్య ప్రభామ్ l
గౌరీ దేహహస ముద్భవాం త్రిజగతా మాధారా భూతాం మహా -
పూర్వామత్ర సరస్వతీ మనుభ జే శుమ్భాది దైత్యర్ధ నీమ్ l l
అర్ధము : తన (యెనిమిది) హస్త కములందు ఘంట ,శూలము, నాగలి, శంఖము, రోకలి, చక్రము,ధనుస్సు , బాణములు ధరించునదియు, మబ్బు యొక్క అంచున ప్రకాశించు చుండు చంద్రుని తో సమమగు కాంతి కలది యు ,పార్వతీ దేవీ శరీరము నుండి ఉద్భవ మొందినదియు, ముల్లోకములకు ఆధార భూత మైనది యు , శుంభుడు మున్నగు దైత్యులను వధించినదియు అగు అపూర్వమైన మహా సరస్వతిని భజించుచున్నారు.

పంచ మాధ్యాయము

ఓం ఋషిఋవాచ l l 1
పురాశుమ్భ నిశుమ్భాభ్యామసురాభ్యాంశఛీ పతే: l
త్రైలోక్యం  యజ్జ్ఞభాగాశ్చహృతా మద బాలా శ్రయాత్ l l 2
అర్ధము : (1 నుండి 2  వ శ్లో ) ఋషి పలికెను : పూర్వ కాలమున శుంభ ని శుంభులు అను రక్కసులు తమ గర్వము యొక్కయు  బలము యొక్క సహాయతతో ఇంద్రుని ముల్లోకముల (ఆధి పత్యమును ), హవిర్భాగము లను హరించిరి.

తావేన సూర్యతాంత ద్వదధి కారంత థైన్దవమ్ l
కౌబేరా మథ యామ్యం చ చక్రాతే వరుణ స్యచ l l 3
అర్ధము : ( 3 వ శ్లో) అట్లే ఆ ఇరువును సూర్య చంద్ర యమ వరుణ కుబేరుల అధికారములు కూడా తమ వశము చేసికొనిరి.

తావేన పవన ద్ద్o చ చక్రతుర్వహ్ని కర్మ చ l
తతో దేవా విని ర్దూతా భ్రష్ట రాజ్ య : పరాజితా : l l 4
అర్ధము :(4 వ శ్లో) వాయువు యొక్కయు అగ్ని యొక్కయు అధికారములు సైతము వారే నిర్వహించిరి. ఇట్లు తమ ఆధి పత్యములను , రాజ్యములను కోలుపోయి దేవతలు ఓటువడిరి.

 First   40  41   42  43  44  45  46  47  48  49  50  51  52  53  54  55  56  57  58  59  60  61   Last

 

No comments:

Post a Comment