Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము66




అర్ధము: (6 వ శ్లో ) బొమ ముడి పాటుతో భయంకరముగా ఉన్న ఆమె నొసటి నుండి హటాత్తుగా ఘోర మగు ముఖములు కలిగి, ఖడ్గ పాశాయుధములను ధరించి కాళికా శక్తి వెలువడెను.

విచిత్ర కట్వాజ్గ ధరా నరమాలా విభూషణా|
ద్వీపి చర్మ పరీ ధానా శుష్క మాం సాతి భైరవా || 7
అతి విస్తార వదనా జిహ్వా లలనభీషణా|
నిమగ్నా రక్త నయనా నాదా పూరిత దిజ్మఖా || 8
సావేగే నాభి పతితా ఘాత యన్తీ మహాసురా |
సైన్యే తత్ర సురారీ ణామ భక్ష యత తద్బలమ్ || 9
అర్ధము:(7 నుండి 9 వ శ్లో ) విచిత్రమగు పుర్రె తల బెత్తముతో, పుర్రెల పేరు ఆభరణము గా ధరించి, పెద్ద పులి చర్మమును కట్టుకుని, కండలు శుష్కించి పోవుటచే మిక్కిలి భీషణ మై చూ పట్టుచు, తెరచు కొనియున్న నోటితో, భయానకముగా వ్రేలాడు నాలుకతో, లోతుకు పోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు నిండించు గర్జా రావములతో, ఆమె ఆ సైన్యములోని మహాసురులపై రాభసముగా పది చంపి, ఆ సుర వైరి బలములను భక్షించెను.

పార్షిణ గ్రాహా జ్కుశ గ్రాహియోధ ఘణ్నా సమన్వితా |
సమాదా యైక హస్తేన ముఖే చిక్షే పవారణా || 10
అర్ధము: (10 వ శ్లో ) ఏనుగులను- వాని వెండి వారలతో, మావటి వాళ్ళతో, స్వారి చేయు యోధులతో, ఘంటలతో సహా -ఒక్క చేతితో లాగి పట్టుకుని నోటిలోనికి విసిరి వేసుకొను చుండెను.

తదైవ యోధం తురగై రధం సారదినా సహా |
నిక్షిప్య వక్త్రే దశ నైశ్చర్య యత్యతి భైరవమ్|| 11
అర్ధము: (11 వ శ్లో ) అట్లే తురగ బలమును - గుఱ్ఱములతో, రధముతో, సారధితో - సహా- నోటిలో వేసుకుని అత్యంత భయంకరముగా పండ్లతో నమిలి వేయు చుండెను.

ఏకం జగ్రాహ కేశే షుగ్రీ వాయా మధ చాపరమ్ |
పాదేనాక్రమ్య చైవాన్య ముర సాన్య మాపోధ యత్ || 12
అర్ధము: (12 వ శ్లో ) ఒకనిని జుట్టు పట్టియు, మరొకనిని మెడ పట్టియు లాగు కొనును, ఒకరిని కాలితో త్రోక్కియు, మరొకరిని రొమ్ముతో నేట్టియు  మట్టిచేసేను.

తైర్ముక్తా నిచ శస్త్రాణి మహాస్త్రాణి తధా సురై: |

 

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

No comments:

Post a Comment