తరువాత కొన్ని
తరములకు హస్తి యనువాడు పుట్టి తన పేరుమీద హస్తినా పురమును నిర్మించెను. అతనికి అజామీఢడు పుట్టెను. ఆ వంశములోనే
జరాసంధుడును, వానికి సహదేవుడును జన్మించిరి. ఆ తరువాత ఋక్షుడు పుట్టెను. వానికి
దిలీపునికి ప్రదీపుడు
పుట్టిరి. ఆ ప్రదీపుడే నా తండ్రి. నన్ను దేవాపి యందురు. నేను నా కొడుకైన హూతునకు రాజ్యాభిషేకము చేసి, వ్యాసమహాముని ఆదేశముమీద కలాపి గ్రామములో నీ కొరకు ఎదురుచూచు చున్నాను.
అంతట కలికిమూర్తి వారిద్దరను జూచి, "యెచ్చట ధర్మ ముండునో అక్కడ జయము కలుగును. మీరు ధర్మము తప్పక ప్రవర్తించి భగావానుని అనుగ్రహమును పొందినారు. కనుక మీకు చెరియొక రాజ్యము నిచ్చుచున్నాను. కలిదోషము లంటకుండ కృతయుగ మన్నట్లు రాజ్యపాలన చేయుడు" అనుచు అయోధ్యకు మరుత్తును, హస్తి పురమునకు దేవాపిని రాజులుగాజేయును. మరుత్తునకు విశాఖయూపుని పుత్రికను, దేవాపికి రుచిరాశ్వుని పుత్రికను ఇచ్చి వివాహములు చేసి, కామగమనము గలిగిన రెండు దివ్య విమానములను వారి కిచ్చును.
ఆ సమయములో కృత యుగము పురుషరూపము ధరించి కలికి మూర్తి దగ్గరకు వచ్చును. కలిగి అతనిని నీవెవ్వరని అడుగగా, "నేను కృతయుగ పురుషుడను. కలిపురుషుని బాధలు తట్టుకొనలేక బాధలుపడుచు, శ్రీ మన్నారాయణుని అవతార మైన నీవు భూమి పై అవతరించినావని అవతరించి నావని తెలిసికొని చూడ వచ్చినానని చెప్పి, అతనిచే సమ్మానము పొందును.
అని సూతుడు శౌనకాదులకు చెప్పుచుండెను. శౌనకాది మునుల కోరిక పై కలియుగములో మ్లేచ్చ పరిపాలనలును, రాజుల స్థితిగతులును, మత సాంఘిక స్థితులను వివరింపసాగెను.
కలిలో దేశకాల రాజకీయ స్థితిగతులు
కలియుగములో రెండువేల సంవత్సరములు గడిచిన తరువాత కలిపురుషుని ప్రభావము ఎక్కువగును.
సూర్య వంశపు రాజులును చంద్రవంశపు రాజులను దేశములను పరిపాలించెదరు.
దేవత్తుడను రాజు రాజ్యము నేలుచు ఒక నాడు తన పురోహితుని బిలిచి, "గురుదేవా! కలియుగము ప్రారంభమై రెండు వేలెండ్లు పైగా అయినది. పురాణములందు చెప్పిన విధముగా జరిగినచో ఈ దేశము మరికొంత కాలములో మ్లేచ్చులచె ఆక్రమణము చేయబడును గదా! అది యెప్పుడు జరుగునో సెలవిమ్మని" అడుగును. అతడు పూరాణములను చక్కగా చదివి, జ్యోతిశ్శాస్త్ర ప్రకారము లెక్కలు కట్టి, "రాజా! ఈ రోజునుండి నలువదవ రోజున మధ్యాహ్నము ఈ దేశమును మ్లేచ్చులు ఆక్రమించెదరు. అయినను వారి అధర్మ పరి పాలనము చేతను, నీ ధర్మ ప్రవర్తనము చేతను మరల నీ రాజ్యము నీకు స్వాధీన మగును" అని చెప్పెను. దానికి రాజు" మహాత్మా! సూర్య చంద్రులు గతులు తప్పిన తప్పవచ్చును గాని, శాస్త్రములను,
First 2 3 4 5 6 7 Last

No comments:
Post a Comment