Friday, May 2, 2014

దేవీ మహాత్మ్యము63




దేవ్యువాచ || 10

దైత్యే శ్వరేణ ప్రహితో బలవాన్బల సం వృత:|
బలాన్నయ సిమామేవం తతః కింతే కరోమ్యహమ్|| 11
అర్ధము : (10 నుండి 11 వ శ్లో ) దేవి పలికెను: "నీవు అసుర పతి చేత పంపబడి తివి; బలము గలవాడవు ; సైన్య సమేతుడవు, నీ విట్లు నన్ను బలాత్కరించి కొనిపోయినచో, నిన్ను నేను ఏమి చేయగలుగుదును?

ఋషి రువాచ ||12

ఇత్యుక్తః సోభ్య దావత్తా మసురో ధూమ్ర లోచనః |
హుజ్కారే ణైవ తం భస్మ సాచ కారామ్భి కాతతః || 13
అర్ధము: (12 నుండి 13 వ శ్లో ) ఋషి పలికెను: ఇట్లు పలుకగా ఆ అసురుడు దూమ్రలోచనుడు ఆమె వైపునకు పరుగిడెను. అంబిక అంతట హుంకార మాత్రము ("హుం" అని గర్జించుట ) చేత అతనిని భస్మీకరించెను.

అధ క్రుద్దం మహాసైన్య మసురాణాం తదామ్భికామ్|
నవర్ష సాయ కైస్తీ క్షైణ స్తదా శక్తి పరవ్వదై:|| 14
అర్ధము : (14 వ శ్లో )అంతట ఆ అసుర మహాసైన్యము క్రోధము నొంది అంబికపై వాడి యమ్ములను,భాల్లములను, గండ్ర గొడ్డండ్లను కురిపించెను.

తతో ధుత సటః కోపాత్క్రుత్యా నాదం సు భైరవమ్|
పపతాసుర సేనాయాం సింహో దేవ్యాః స్వవాహనః || 15
అర్ధము : (15 వ శ్లో ) అంతట దేవి వాహన మగు సింహము కోపముతో కేసరములు (జూలు ) విదుల్చుచు, మిక్కిలి భయంకరముగా గర్జించుచు అసుర సైన్యము మీద పడెను.

కాంశ్చిత్కర ప్రహారేణ దైత్యా నాస్యేన చాపరా|
ఆక్రాన్త్యా చాధరే ణాన్యా  సజఘాన మహాసురా || 16
అర్ధము : (16 వ శ్లో ) కొందరిని తన ముందరి కాలి దెబ్బతోను, కొందరి ని తన నోటితో ను,మరి కొందరు మహాసురులను తన వెనుక కాళ్ళతో త్రొక్కియు అది చంపెను.

కేసాచ్చా త్పాట యామా సన ఖై : కోష్టాని కేసరీ |
తధా తల ప్రహారేణ శిరాం సి కృత వా పృధక్|| 17
అర్ధము : (17 వ శ్లో ) సింహము తన గోళ్ళతో కొందరి లోకడుపులను చీల్చెను. మరి కొందరి శిరస్సులను తన "పంజా " దెబ్బతో ఖండించెను.

 

 First   60   61   62   63   64   65   66   67   68   69   70    71
 72   73   74    75    76    77    78    79    80    81      Last

No comments:

Post a Comment