దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా 17
అర్ధము: (17వ శ్లో): "కష్ట వేళలందు నిన్ను
తలచుకొనువారి కెల్లరకును నీవు భయమును నివారింతువు. స్వస్థులై సుఖించువారు నిన్ను తలచుకొన్నచో
అంతకన్న శుభాధికమగు బుద్ధి నిత్తువు. పేదరికమును, కష్టములను, భయమును పోగొట్టు ఓ దేవీ, ఎల్లరకును ఉపకారము చేయగల మెత్తని చిత్తము నీకు తప్పమరి ఏ
దేవతకు కలదు?
ఏభిర్హ తైర్జ గదుపైతి సుఖం త థైతే
కుర్వన్తు నామ నరకాయ చిరాయ పాపమ్
సంగ్రామమృత్యు మధిగమ్య దివం ప్రయాన్తు
మత్వేతి నూనా మహితాన్విని హంసి దేవి 18
అర్ధము: (18 వ శ్లో): "వీరిని చంపుటవలన
లోకమునకు సుఖము కలుగును. వీరు చిరకాలము నరకమున ఉండదగిన పాపములు చేసినవారైనను, చివరకు (నాతోడి) యుద్ధములో మృతులై స్వర్గమును పొందుదురు గాక' అని ఇట్లు తలచి దేవీ, నీవు (మా)
శత్రువులను చంపుదువు.
దృష్ట్వైవ కిం న భవతీ ప్రకరోతి భస్మ
సర్వాసురానరి షు యత్ప్ర హిణోషి శస్త్రమ్
లోకాన్ప్రయాన్తు రి పవో పి హి శస్త్ర పూతా
ఇత్ధం మతిర్భవతి తే ష్వపితే తిసాద్వీ 19
అర్ధము:(19వ శ్లో): "అసురులు అందరు నీవు చూపు మాత్రముననే భస్మము
చేయుదువు కదా. కాని నీవు వారిపై శస్త్రములను ప్రయోగించుట ఏల
అనగా శత్రువులుగా ఉండువారుకూడా ఆశస్త్రముల చేత పవిత్రత చెంది ఉత్తమ
లోకములను పొందుదురు గాక అని నీకు వారి యెడ కూడా గల అత్యంత సాదు చిత్తము ఇట్టిది.
కేనో పమా భవతు తేస్య పరాక్రమస్య
రూపం చ శత్రు భయకార్యతిహరి కుత్ర
చిత్తే కృపా సమర నిష్టురతా చ దృష్టా
త్వయ్యేవ దేవి వరదే భువనత్రయే పి 22
అర్ధము:(22వ శ్లో): "నీ యీ పరాక్రమమున దేనితో పోల్చదగును? అత్యంత మనోహర మయ్యును, శత్రువులయందు
భీతిని కలిగించు నీ సౌందర్యము మరెచ్చట కానవచ్చును? హృదయమున కృపయు, యుద్ధమున నిష్టురతయు మరెచ్చట కానవచ్చును? దేవీ, వరప్రదాయినీ యీ ముల్లోకములందు నీలో
మాత్రమే కానిపించును.
No comments:
Post a Comment