శివాజీ
మరాటి రాజు 1674 లో శ్రీశైలమువచ్చి మల్లి కర్జునునకు అమ్మవారికి పూజలు చేసి వెళ్ళెను. ప్రాకార పు గోడకు ఉత్తరపుగో పురము కట్టించినది 'శివాజీ' స్థానిక ప్రతీతి. ఇది గాక, శివాజీ వెళ్ళుచు శ్రీ శైలపు గుడికి రక్షణ నిమిత్త ము కొందరు మరా టి సైనికులను వదలి వెళ్ళినట్లు చెప్పుదురు 'రోహిల్లాలు' దండు (సహేబుల్) గుడి మీద దండెత్తిన సందర్బములో మరా టి సైనికులు చివరి నాడు చచ్చువరకు ను పోరాడిరి. ఇప్పటికి ని ఈ యోధుల కై వారి సంత తివారు శ్రీశైలము వచ్చి గౌర వార్ధము కొన్ని ఉత్సవ ములుజరి పెదరు.
మొగలు చక్రవర్తి 'ఔరంగా జేబు'బి జపూర్, గోల్కొండ జయించుటతో కర్నూలు 'జిల్లా' మొగలు సామ్రాజ్యములోనికి పోయినది 'గియానుద్దిన్' అను సేనాని చక్రవర్తి స్థాన మున నీ ప్రాంత మును వశ పరచుకోనెను. 'రాజా భి' మసింగు 'ను గవర్నరుగా నియమించెను (దరి మిలా) ఈ కర్నూలు ప్రాంతము 'దావూద్ ఖాన్' అనునొక పటాని సేనానికి జాగీ రుగా ఇయ్యబడుటచే వారి సంత తి వారు కర్నూలు వాబు లైరి. అనంతరము 'ఇబ్రహింఖాన్' కు (దావూద్ ఖాన్ 'తమ్మునకు) సంకర మించెను.
ఇతడు హిందువులయెడ దయ, సహన ము గలవాడు. శ్రీ శైలపు గుడి వెనుకటి ధర్మకర్తల వశమున నున్నద ని చెప్పడి 'సనద్'(హక్కుల దస్తా వే జు - 1712 నాటి ది) ద్వార మున శ్రీ శైలపుగుడి అనుభవమున ఉన్న గ్రామములు, ఆస్తులు, వారి వారికి దిరిగి 'పట్టా'లిచ్చి అధినము చేసెను. గోల్కొండ మంత్రి మాదన్న కాలములో నిర్ణ యింప పబడిన పన్నులు స్ధిర పరచెను. 1741 లో 'రాఘో బా' క్రింద అ ధి కారి గా ఉన్న 'ఫతే సింగు ' అనువాని నాయకత్వమున మరాఠి సేన కర్ణాటి ప్రాంతమును దోచెను. ఈ సమయమున అక్కడి ప్రజలను వారి దారి వారి దని వదలి కర్నూలు నవాబులు పారి పోయిరి.
ఇట్లు ఔరంగ జేబు సంత తివారి అ ధి కారము దక్షిణమున నశింపగా మొగలు చక్రవర్తుల క్రింద 'దక్కన్ సుబె దారు' లుగా ఉన్నవారు స్వతంత్ర రాజులై దీ ని నేల ప్రారంభించిరి. వీరు 'హైదరాబాద్ నవాబు 'లుగా పిలువబడిరి.
18 వ శతాబ్ది మూడవ పాదమున మైసూరులో 'హైద రాలి 'అధ్ కారములో కి వచ్చి ప్రక్క 'జిల్లా'లైన కర్నూలు, అనంతపూరు అక్రమించుటకు బెదిరించెను. 'హైద రు'తో సంధ్ చేసి కడప, కర్నూలు, 'జిల్లా' అతనికి చ్చుటకు వీ రంగి కరించిరి.'హైదరు' తన అధ్ నము చేసికొనుటకు దండ యాత్ర చేసెను. ఈ ప్రాంతము (దరి మలా) 'హైద రాలి' అత నికోడుకులు 'టిప్పు సుల్తాను'లను వారి ప్రభావము లో నికి వచ్చెను. కొద్ది కాలము వీరి ప్రభావము ఈ ప్రాంతము పైబడెను.
శ్రీశైలము- అలయములు
'ఇచ్చటి దేవాలయ ప్రకరముల ద్వార మూలా పైన మూడ గోపురమలున్నవి. అమూడు 'తూర్పుగో పురము, దక్షి ణ గోపురము, ఉత్తర గోపురము 'అనున వి. ఇందు మొదటి రెండును ఇంచుమించు ఒకటిగ నున్నవి. ఇవి అలంకారపు ఆడంబరము లేనివి యున్నవి. ఇచ్చటి శిల్పము 16 వ శతాబ్ది పు విజయనగర శిల్పమును గొంత పోలియున్నది. ఇందు దక్షిణ గోపురము విజయనగర రా జైన రెండవ హరి హర రాయుడు కట్టె నని చెప్పుదరు
No comments:
Post a Comment