Friday, December 20, 2013

శ్రీ స్కంద పురాణము4





సోమవార వ్రత మహిమ

విదర్భ దేశములో వేదమిత్రుడు ,సారస్వతుడు అను బ్రాహ్మణు లిద్దరుండిరి. వారు ప్రాణ మిత్రులు వేద మిత్రుని కొడుకు సుమేధుడు సారస్వతుని కొడుకు సామ వంతుడు . వీరిద్దరూ కూడా మిత్రులై ఒకే గురువు దగ్గర సమస్త విద్యలును అభ్యసించి పండితులైరి . వారికి వివాహ యోగ్యమైన వయసు వచ్చెను. వేద మిత్ర సారస్వతులు ధనవంతులు కారు. అందుచేత కొడుకులతో " మీ పాండిత్యములతో ఈ దేశపు రాజును మెప్పించి ధనము సంపాదించుకుని రండు " అని పంపిరి. వారు వెళ్లి రాజ దర్శనము చేసి ,తమ పాండిత్య ప్రకర్షనను ప్రదర్శించిరి. ఆ రాజు మీకేమి కావలెనని యడిగెను. వివాహము చేసికొని గడుపుకొనవలెను గాన ,మా విద్వత్తును మెచ్చుకున్నచో తగిన బహుమాన మిప్పింపుడని వారడగిరి. రాజునకు ,రాకూడని ఒక కొంటె ఆలోచన వచ్చెను. " మీలో ఒకరు ఆడు వేషము వేసికొని ,మీరు భార్యా భర్తల వలె నటించుచు ,నిషేద రాజైన చంద్రాంగదుని యొద్దకు వెళ్లుడు. ఆయన భార్య సీమంతిని మహా శివ భక్తురాలు. సోమవారము నాడువ్రతము చేయుచు దంపతీ పూజ చేసి అపరితమైన ధనములను కానుకగా నిచ్చును. వెళ్లి తెచ్చికొనుడు . మీ దారిద్ర్యము తీరిపోవు " ననెను. వారు కపట కృత్యమునకు భయపడుచుండగా " ఇది రాజాజ్ఞ తప్పక పాలింప వలసినదే పొండు " అని అంతః పుర పరిచారికలను బిలిచి సామ వంతునికి ఆడువేషము వేయించి పంపెను.


 First  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last  

No comments:

Post a Comment