Tuesday, December 3, 2013

శివ గీత15




క్షత్రియోహం ముని శ్రేష్ఠ! - భార్యా మే రక్ష సా హృతా. 9
యదితం నిహ న్మ్యాశు - జీవనే మేస్తి కిం ఫలమ్,
అతస్తే తత్వ బోదేనన - మే కించిత్ప్ర యోజనమ్ 10
శ్రీరాముడు పలుకుచున్నాడు: ఓయీ! మునికుల
 చంద్రా! క్షత్రియ వంశ జనితుండ నేను.
 నా సతియైన సీతా దేవి రావణుని చేత అపహరించ బడినది.
 అందుచేత లంకాధి పతియైన రావణుని చంపి నా సీతను
 అతని చెరవిడి పంపకుండిన నేను బ్రతికి యుండుట ప్రయోజనమేమి?
కాన నీవిప్పుడు నాకు బోధించు తత్వము నుండి ఏలాంటి లాభము లేదు.
 కామ క్రోధ లోభ మోహము మొదలగు నరి షడ్వర్గము
నా దేహమును దహింప చేయు చున్నది. అహంకార మనునది
నన్ను ఎల్లప్పుడు నా ప్రాణముల నపహరింప
చేయుటకు నుధ్యుక్తమై యున్నది.

కామ క్రోధాదయ స్సర్వే -దహంతే తే తనుం మమ,
అహంకారో పిమే నిత్యం - జీవనం హర్తు ముధ్యతః .11
హృతాయాం నిజ కాన్తాయాం - శత్రుణాం మమ తస్యవా,
యస్య తత్త్వ బుభు త్సాస్యా -త్స లోకే పురుషా దమః 12
తస్మాత్త స్యవదో పాయం -లంఘ యిత్వాం బుదింరణే ,
బ్రూహి మే ముని శార్దూల! - త్వత్తో నా న్యోస్తి మే గురు: 13
నా ప్రియమైన భార్య అపహరింప బడు చుండగా శత్రువు చేత
 నవమానించ బడిన వాడికి తత్వ జిజ్ఞాస కలుగునో వాడు జగత్తు
నందు పురుషాధము డనబడును.
 అందుచేత సాగరమును లంఘించి నాకు శత్రువైన రావణుని పరి
మార్చుటకు తగిన మార్గము నాలోచించి ఆనతిమ్ము.
 నీవు దక్క నాకు వేరే గురువు లేడని రాముడు పలికెను.

ఏవం చే చ్చరణం యాహి - పార్వతీ పతిమ వ్యయమ్,
సచేత్ప్ర సన్నో భగవా - న్వాంఛి తార్ధం ప్రయచ్ఛతి . 14
దేవైర జేయ శ్క్రాద్యై - ర్హరి నా బ్రహ్మ ణాపివా,
సతే వధ్యః కధం వాస్యా - చ్చంక రాను గ్రహం వినా ? 15
అగస్త్యుడు చెప్పుచున్నాడు: అలా అయితే మృత్యుడు లేని మృత్యుం
జయుడైన పరమ శివుని ఆశ్రయించుము .
ఆ పరశివ మూర్తి ప్రసన్నుడయ్యె నేని నీ అభీష్టములను
తీర్చుటకు అతనొకడే సమర్ధుడు. లంకాధి పతియగు
రావణాసురుడు ఇంద్రాది దేవతలకు బ్రహ్మ విష్ణువులకును
జయింప రాని వాడు నీ యందు నా పరమ శివుని యనుగ్రహమే
 లేనియెడల అతనిని నీవు జయించ లేవు; సీతను పొందుట
 కూడ నీకు సాధ్య పడదు.




No comments:

Post a Comment