సత్య జ్ఞానాత్మ కోనన్తో- విభూరాత్మా మహేశ్వరః 27
అగస్త్యుడు చెప్పుచున్నాడు: ఆ మహేశ్వరుడు పన్నిన మాయను
తెలిసి కొనుటకు ఎవరికి సాధ్య పడును.? ఆ మహేశ్వర మాయ
వలన ఈ ప్రపంచ మంతయు మోహింప బడినది.
అట్టి మాయను ప్రకృతి గను, మాయామయుడు
మహేశ్వరుడని యెరుంగుము.
ఆ మహేశ్వరు డెటువంటి వాడనగా సాక్షాత్తుగా సత్య జ్ఞాన స్వరూపుడు.
నాశము నభః పుష్పము వంటివాడు.
(అనగా మృత్యుంజయుడు ) సకల లోక సంరక్షకుండు,
ఆత్మ స్వరూపుడు అతని యుపాంగ భూతములైన (అవయములైన )
చేతనాచేతన ప్రాణి కోటి చేత నీ ప్రపంచమును నిండా
ఆవరించు కొని యున్నది.
తస్యై వాంశో జీవ లోకే - ప్రాణి నాం హృదయే స్థితః 28
విస్పులింగా యధా వహ్నే - ర్జాయన్తే కాష్ట యోగతః,
అనాది కర్మ సంబందా - త్తద్వ దంశా మహేశితు: 29
రాపిడి కలిగిన కర్రల నుండి యగ్ని బుట్టి దాని కణములు
వ్యాపించి నట్లుగా మానవుని యనాది సంచిత మగు కర్మ
వాసన చేత మహేశ్వరాంశము ప్రపంచ మందలి ప్రాణి కోటి
హృదయము లందు ఇమిడి యున్నది.
అనాది వాసనా యుక్తాః క్షేత్ర జ్ఞా ఇతితే స్మృతాః,
మనో బుద్ది రహంకార - శ్చిత్తం చేతి చతుష్టయమ్ 30
అన్తః కరణ మిత్యాహు - స్తత్రతే ప్రతి బింబితాః,
జీవిత్వం ప్రాప్నుయు: - కర్మ ఫల భోక్తార ఏవతే 31
అనాది యగు వాసనల చేత నిండి యున్న అట్టి మహేశ్వరాంశ
సంజనితు లైన ప్రాణులు క్షేత్ర జ్ఞాలన బడుచున్నారు.
మనస్సు - చిత్తము బుద్ది - అహంకారము ఈ నాల్గింటిని
యంతః కరణ చతుష్టయము లందురు.
వీటిలోనే ప్రతి బింబముగా నేర్పడిన చైతన్యమే ప్రాణముగా రూపొంది
పుణ్య పాపముల ఫలముల ననుభవించు చుండును.
( సుఖ దుఃఖము లను జీవుడు అనుభవించు చుండునని భావము )
తతో వైష యికం తేషాం - సుఖం నా దుఃఖమేవ నా,
త ఏవ భుంజతే భోగా యత నేస్మిన్ శరీరకే 32
స్థావరం జంగమం చేతి - ద్వివిధం న పురుచ్యతే,
స్థాన రాస్తత్ర దేహా స్స్యు - స్సూక్ష్మా గుల్మల తాదయః 33
No comments:
Post a Comment