ఫెంగ్‌షుయ్ వాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఆఫీసు గదులను నిర్మించే వారు ఇటీవల కాలంలో అధికమవుతున్నారు. సొంత వ్యాపారమైనా, కంపెనీలో ఉద్యోగమైనా మనం ఉండే ఆఫీసు గది ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీ యజమాని కూర్చునేచోటు ఇతర ప్రధాన ఫెంగ్‌షుయ్ అంశాలమీద... అంటే వ్యాపార అభివృద్ధిమీద ప్రభావితం చేస్తుంటాయి.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆఫీసు గదులను ఏర్పాటు చేసుకోవటం మంచిది. ఆఫీసు గది ద్వారానికి వీలైనంత దూరంలో యజమాని గది ఉండాలి. ఇలా చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యజమాని తన గది వద్దకు సమీపించే వ్యక్తులు గురించి సరైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది. యజమాని లేదంటే మేనేజర్ డెస్క్‌లు సబార్డినేట్ డెస్క్‌లు ఒకే గదిలో ఉన్నప్పుడు యజమాని తాలూకూ డెస్క్‌ను ఓ మూలకు ఏర్పాటు చేసుకోవాలి.
రెండు డెస్క్‌లు పక్కపక్కనే ఉండటం వల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. గదిలో వెనక కిటికీ లేదంటే తలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ విరుద్దంగా కిటికీ, తలుపులు ఉండేవిధంగా గదిని ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ అదృష్టాన్ని మీరు అడ్డగించిన వారవుతారని శాస్త్రం చెపుతోంది. అలాగే ఆఫీసు గదిలో పచ్చదనం చిందించే మొక్కలను ఉంచుకున్నట్లైతే మరింత ఉత్సాహంగా ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు.
అదే విధంగా ఫిష్ ఆక్వేరియం ధన స్థిరత్వానికి ప్రతీక. అందువల్ల ఆఫీసు గదిలో గోల్డ్ ఫిష్ ఉండేలా ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవటం వల్ల ఆర్థిక స్థితిగతులు కొలిక్కి వచ్చి మెరగవుతాయి. కంప్యూటర్స్, టెలిఫోన్స్, ఫ్యాక్స్ మెషీన్స్ వంటి వాటిని పశ్చిమ దిశలో ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆఫీసు గదికి వాడే రంగులు చేస్తున్న వ్యాపార గుణాన్ని ప్రతిబింబించాలి.
కంపెనీ వాడే లోగో వ్యాపార సంబంధ అంశాన్ని, వ్యక్తి తాలూకూ జాతక చక్రాన్ని అనుసరించి ఉండాలి. ఈ విషయంలో చైనీస్ క్యాలెండర్ బగువా చిత్రాన్ని పరిగణలోనిక తీసుకోవాలి. సొంతంగా ఆచరించగల విషయాలను అమలు పరచాలి. అర్థంకాని విషయంలో మాత్రం ఫెంగ్‌షుయ్ శాస్త్రాన్ని కచ్చితంగా అనుసరించాలి.
No comments:
Post a Comment