గజేంద్ర
మోక్షము
త్రికూట పర్వతారణ్యములో ఒక గజరాజుండెను .అతనికి దశ లక్ష భార్యలు గలరు. అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహము వేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి,కరిణులతో జలక్రీడలకు దిగి , చెరువు నంతను కలచి వేసెను .
ఆ చెరువులో ఒక పెద్ద మొసలి యున్నది .అది వచ్చి గజరాజు కాలు పట్టుకొనెను ఏనుగు విదిల్చి కొట్టెను .మొసలి మరల పట్టుకుని విడువలేదు ,లోపలికి లాగు చుండెను .గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయు ఏండ్లు గడిచెను . స్థాన బలము చేత నీటిలోని మొసలి మరింత విజ్రుంబించెను . గజరాజునకు బలము సన్నగిల్లెను .మొసలిని గెలవగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించు వారెవ్వరను కొనెను .పూర్వ సుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిర బుద్ది కలిగెను. అప్పుడు
శా || లావొక్కింతయు లేదు ధైర్యము విలో లంబయ్యే ప్రాణంబులన్
రావుల్ దప్పెను, మూర్చ వచ్చే ,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెరుగ ,మన్నింప పంద గుందీ నునిన్
రావే ! యీశ్వర ! కానవే వరద ! సంరక్షింపు భద్రాత్మకా !
అని మొర పెట్టుకొనెను .ఆ మొర విని విష్ణు దేవుడు కరిగి పోయెను. తాను విశ్వ మయుడు గాన ,గజేంద్రుని రక్షింప దలచెను.
అహంకారము జీవ లక్షణము .అది జీవుని అంత
త్వరగా వదలదు .అది ఉండుట ,అవసరమే అయినను మితి మీర కూడదు. ఆత్మ రక్షణకై సకల
జీవులు ప్రయత్నించును . అది తప్పు కాదు .తానే బలవంతుడను అను అహంకారము అనర్ధము
తెచ్చును. గజేంద్రుడు తన్ను తాను రక్షించు కొనుటకై పోరాడునంత కాలమును
శ్రీనాధుడు పట్టించు కొనలేదు.త్రికూట పర్వతారణ్యములో ఒక గజరాజుండెను .అతనికి దశ లక్ష భార్యలు గలరు. అతడొకనాడు భార్యలతో అడవిలో దిరుగుచు దాహము వేసి, ఒక చెరువులో దిగి నీళ్ళు ద్రావి,కరిణులతో జలక్రీడలకు దిగి , చెరువు నంతను కలచి వేసెను .
ఆ చెరువులో ఒక పెద్ద మొసలి యున్నది .అది వచ్చి గజరాజు కాలు పట్టుకొనెను ఏనుగు విదిల్చి కొట్టెను .మొసలి మరల పట్టుకుని విడువలేదు ,లోపలికి లాగు చుండెను .గజము ఒడ్డునకు లాగుచుండెను. పోరు ఘోరమయ్యెను. వేయు ఏండ్లు గడిచెను . స్థాన బలము చేత నీటిలోని మొసలి మరింత విజ్రుంబించెను . గజరాజునకు బలము సన్నగిల్లెను .మొసలిని గెలవగలనా లేదా యని సందేహము కలిగెను. రక్షించు వారెవ్వరను కొనెను .పూర్వ సుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు రక్షకుడు లేడను స్థిర బుద్ది కలిగెను. అప్పుడు
శా || లావొక్కింతయు లేదు ధైర్యము విలో లంబయ్యే ప్రాణంబులన్
రావుల్ దప్పెను, మూర్చ వచ్చే ,తనువుం డస్సెన్ శ్రమం బయ్యెడిన్
నీవే తప్ప నితః పరం బెరుగ ,మన్నింప పంద గుందీ నునిన్
రావే ! యీశ్వర ! కానవే వరద ! సంరక్షింపు భద్రాత్మకా !
అని మొర పెట్టుకొనెను .ఆ మొర విని విష్ణు దేవుడు కరిగి పోయెను. తాను విశ్వ మయుడు గాన ,గజేంద్రుని రక్షింప దలచెను.
మన యవసరము లేదు లెమ్మని యూరకున్నాడు . ద్రౌపది విషయములో గూడ ఇంతే కదా ! దుశ్శాసనుడు చీర లొలుచు చుండగా ఆత్మ రక్షణకై చాలా ప్రయత్నించిన దామె. శత్రువు ముందు తమ బలము చాలదని గ్రహించిన తరువాతనే వారు దైవమును శరణు వేడిరి .అంతవరకును చూచుచు ఊరకుండిన శ్రీ హరి అప్పుడు రంగములోనికి దిగినాడు .అది అతని శరణాగత రక్షణ గుణమునకు పరాకాష్ట .సర్వమునకు దైవమే శరణ్య మని నమ్మిన భక్తులను ఆయన ఆత్మీయులుగా భావించి రక్షించును .
శ్రీ హరి గజరాజు మొర వినగానే ప్రక్కనున్న లక్ష్మీతో గూడ చెప్పకుండ పరుగుల మీద వచ్చి చక్రాయుధముతో మొసలి ని జంపి గజరాజును కాపాడినాడు.
అని శుకముని పరీక్షిత్తునకు జెప్పి ,"రాజా ! గజేంద్రుడు పూర్వ జన్మములో ఇంద్రద్యుమ్నుడను రాజు విష్ణు భక్తుడు ఒకనాడు అతడు శ్రీ హరి ధ్యానములో నుండగా అగస్త్యుడు అక్కడకు వచ్చెను. రాజతనిని జూడలేదు. అందుచే ఆ ముని కోపించి "నీవు మదముతో నాకు మర్యాదలు చేయ వైతివి కావున మద గజమవై పుట్టు "మని శపించెను. పూజించ దగిన మహాత్ములను పూజించ కుండుట శ్రేయో భంగ కరము కదా !
అట్లు ముని శాపమున ఆ రాజు గజరాజై పుట్టెను. పూర్వ జన్మ వాసన చేత మనసులో హరి భక్తి అంకురించి విష్ణుదేవుని యనుగ్రహమునకు పాత్రుడయ్యెను . మొసలి ,హు హూ అను గంధర్వుడు దేవలుని శాపముచే అట్లయ్యెను శ్రీ హరి చక్ర ధారచే చచ్చి పుణ్యగతికి పోయెను.
విషమ పరిస్థితులలో చిక్కుకున్న వారెవ్వరైనను ఈ గజేంద్ర మోక్షణ కధను భక్తితో చదివినను ,విన్నను సర్వాపదలు తొలిగి పోయి సుఖ పడుదురు .ఉత్తమ గతిని గజేంద్రుని వలె పొందుదురు .
No comments:
Post a Comment