ఆయన " నీకే వరము
కావలెనో కోరు "మనగా ", కామములు
వృద్ది పొందని వరమి "మ్మని ప్రార్ధించెను.
ఆ దేవుడు మెచ్చి ,ప్రహ్లాదా
! నీవు నిష్కామ బుద్దితో ఈశ్వరార్పణముగా
సకల కార్యములు చేయుచు రాక్షస రాజ్యమును పాలించి చివరికి నన్ను చేరెదవు." అని పలికి .తన్ను జూడ వచ్చిన బ్రహ్మతో
" రాక్షసుల కిట్టి వరము
లెన్నడును ఇయ్యకు "మని చెప్పి యదృశ్యుడయ్యెను .
ప్రహ్లాదుడు నరసింహమూర్తిని
జూచి భయపడలేదట .జ్ఞానియైన వానికి భయము కలుగదు . భక్తి ముదిరినచో జ్ఞానమగును. " భజ్ " ధాతువు లోని చివరి
జకారమును "డుక్రుజ్న" (కరణే) లోని
జ్న కారమును కలిపినచో "జ్ఞ " అగును." జ్ఞా " దాతువునకు తెలియుట అని యర్ధము .(ఇది మా గురువులు శ్రీ కేశి రాజు వేంకట నృ
సింహ అప్పారావు
గారు నిర్వహించిన జ్ఞాన శబ్దోత్పత్తి ) జ్ఞానికి సర్వమును
ఆత్మ స్వరూపముగా కనబడును . తన్ను జూచి తానే భయ పడు వాడుండునా? ప్రహ్లాదుని అప్పటి స్థితి అది .అందుచే భయపడలేదు." యదా
హ్యే వైష ఏతస్మిన్నదృశ్యే
నాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్ఠాం విందతే . అధ సో భయంగతో భవతి యదాహ్యే వైష ఏతస్మిన్ను దర మంతరం కురుతే | అధ తస్య భయం భవతి " ( కనిపించని అనిర్వచ నీయమైన పరమాత్మ యందె బుద్ది స్థిరముగా
నిలిచిన జ్ఞానికి భయముండదు .
సృష్టిని పరమాత్మ కంటే వేరుగా జూచు వానికే భయము అని యర్ధము ) (తై. ఉపనిషత్తు ).
ప్రహ్లాదుడు కామములు వృద్ది పొందని వర మిమ్మనుటలోని అంతరార్ధ మిది : కోర్కెలు అనంతములు అవి తీరనిచో క్రోధము గలుగును. (కామత్క్రో ధోభి జాయతే - గీత ) దానివలన అనేక దుఃఖములు కలుగును . కోరికలే లేనిచో ? మనస్సు ప్రశాంతముగా నుండి అందులో దైవ చింతనము చేయు సంకల్పము కలుగును .అది ఇహ పర సాధనము .

No comments:
Post a Comment