సూర్యుడు - హృదయ , నేత్ర సంబంధ వ్యాదులు, రక్త ప్రసరణ ,
వెన్నెముక సంబందిత వ్యాధులు, శరీరంలో శక్తి హీనత,
పురుషులకు కుడి కన్ను ,మహిళలకు ఎడమకన్ను.
చంద్రుడు - ద్రవ సంబంధ మైన రుగ్మతలు, పైత్యం,
దగ్గు, రొమ్ము, ఉదర వ్యాధులు, ఆస్తమా , పురుషులకు
ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను , మానసిక రుగ్మతలు.
బుధుడు - జీర్ణాశయం, నరాలు, ఊపిరితిత్తులు, మూగ,
చేతులు,నాలుక, నోటికి సంబందించిన రుగ్మతలు,
మూర్చ వంటి మానసిక వ్యాధులు.
శుక్రుడు - జననేంద్రియ రుగ్మతలు, గొంతు, మెడ,
బుగ్గలు, చర్మ వ్యాధులు.
కుజుడు - నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు,
పురుష జననేంద్రియాలు, మొలలు, రక్త స్రావం, గాయాలు,
ఉష్ణ వ్యాధులు, అగ్ని, విద్యుత్ ప్రమాదాలు.
గురువు - కాలేయం, మధుమేహం,రక్త నాళాలు,
కుడిచెయ్యి, తొడలు, పిరుదులు.
శని - దంతాలు, ఎముకలు, మోకాళ్ళు,
కీళ్ళ సంబంధిత నొప్పులు, చర్మ వ్యాధులు.
ఇంద్ర- రక్త ప్రసార నాళాలు, మెదడులోని నరాలు,
వెన్నెముక భాగాలకు సంబంధించిన అంతు చిక్కని
వ్యాధులు, ఆకస్మిక ప్రమాదాలు.
వరుణ- మానసిక రుగ్మతలు, మూర్చ, మతి బ్రమణం,
అంటూ వ్యాధులు, కలుషిత ఆహారాలు,
తాంత్రిక వ్యాధులు, దృష్టి మాంద్యం.
యమ - వంశ పారంపర్య వ్యాధులు, జననేంద్రియ వ్యాధులు,
ప్రమాదాలు ,మన శరీర భాగాలలో ఏ భాగం ఏ వ్యాధికి గురవుతుందో లగ్న,
సూర్య , చంద్ర రాశులను, వాటి అధిపతులను బట్టి నిర్దారించు కోవచ్చు .
లగ్న రాశి నుంచి గాని , సూర్య రాశి నుంచి గాని ,
చంద్ర రాశి నుంచి గాని 6 ,8 ,12 స్థానాలు
అనారోగ్య స్థానాలు అంటే ఆ రాశులు , ఆ రాశి అధిపతులు ,
ఆ రాశిలో వున్నా గ్రహాలూ ,కారకత్వాలను తెలుసు
కుంటే రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది .
వైద్య జ్యోతిషం 2
No comments:
Post a Comment