Friday, December 20, 2013

శ్రీ స్కంద పురాణము17




మహానుభావుడవు గనుక నీవు చెప్పగలవు ; చెప్పినవి ఆచరించ గలవు కూడ" అని వ్యంగ్యముగా మాట్లాడెను. అంతటితో ఊరకుండక " నీకు నీ అభాగ్యము వలన బిక్ష దొరుకలేదు .దానికి పురవాసుల దోషమేమున్నది ? ఎందుకు వారిని వృధాగా శపించి నావు ? ఇది నా రాజధాని. దీనిపై నీవంటి వారి శాపములు పనిచేయవు. నీ వంటి క్రోధనుడు మహాపుణ్య క్షేత్రమైన కాశీలో నివసించుట కర్హుడు కాడు. వెంటనే ముక్తి క్షేత్రమైన కాశీ వదలి పొమ్ము. ఈ కాశీపై ఎవడైనా దుర్మార్గము చూపిన చో వాడు రుద్ర పిశాచ మగును"  అని కటినముగా మాట్లాడెను .
అది విని వ్యాసుడు గడ గడ వనుకుచూ వారి పాదములపై వ్రాలి జగన్మాతతో ," తల్లీ !నేను అనాదుడను ,అవివేకిని , నిన్నే శరణు పొందినాను .రక్షింపుము .నీ కుమారుని వంటి వాడను .విశ్వనాధుని శాపము నుండి నన్ను కాపాడుము. కాశీని విడిచి నేను బ్రతుకలేను . ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును నాకు కాశీ ప్రవేశమునకు అనుమతి దయ చేయుము. " అని దీనముగా ప్రార్ధించెను. ఆ జగన్మాత కరుణామూర్తియై ,తన భర్త మొగము వంక చూచెను. తరువాత వ్యాసునితో " నీ కోరిక తీరునులె" మ్మని పలికెను. ఆ దంపతులు అంతర్ధాన
మొందిరి. వ్యాసుడు వెంటనే కాశీని విడిచి గంగకు తూర్పు తీరమున నివసించుచు నిత్యము కాశీ నగరము వైపు చూచి నిట్టూర్చుచు తన దురదృష్టమును నిందించు కొని చుండెను. అప్పుడు అతడు నివసించినదే "వ్యాస కాశి ".
యాత్రలకు వెళ్ళినవారు ,వ్యాసేశ్వరుని దర్శించు కొని వెంటనే తిరిగి వచ్చెదరు.వ్యాస కాశి లో నివశించరు.
అగస్త్యునకు స్కందుడీకధ చెప్పి ," మునీశ్వరీ ! కాశీకి శుభము గోరువారి కెల్లప్పుడును శుభములే కలుగును "అని చెప్పెను.


 First  2  3  4  5  6  7  8  9  10  11  12  13  14  15  16  17  18  19  Last  



No comments:

Post a Comment