తరువాత మంధరకుని
మాటపై వారందరును గలిసి మాళవ దేశములో నున్న సంవర్తుడను మహాముని దగ్గర కేగిరి .శ్రమ పడి ఆయన దయ సంపాదించిరి. ఆయన " ఈ
ఇంద్రద్యుమ్నుని యాగముల వలన
ఉడికిన భూమి నుండి పొంగిన మహానది ఇదే .ఇది తీర్ధముల లోనికెల్ల మహా మహిమ కలది . నేను ఏబది యారు కల్పముల నుండి యీ నదీ తీరమున
తపము చేసికొను చుంటిని .
మీరును ఈ నదిలో స్నానమాడి శివుని
సేవింపుడు .మీకు ఉత్తమ గతులు కలుగు " నని బోధింపగా వారతనిని గురువుగా
భావించి స్నానము చేసి ,శివుని ఆ నదీ జలములతో అబిషేకించుచు శివుని యనుగ్రమును
సంపాదించిరి. ఇంద్రద్యుమ్నుడక్కడ మహాకాళేశ్వరుడను పేరా ఒక శివ
లింగమును ప్రతిష్టించి పూజించెను. ఆ రీతిగా వారు చేసిన శివార్చనముల వలన
శాశ్వతముగా శివలోకమును బొందిరి. నాడీ జంఘాధులకు శాపములు తోలిగెను . వారు గూడా
ప్రమధ గణములలో వారి వారి స్థానములను బొందిరి.శివార్చనము సకల శ్రేయోదాయకము అంతే కాదు .స్వర్గాది భోగములు తాత్కాలికములు . "క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి " ( పుణ్యము తరిగి పోగానే స్వర్గము నుండి జారి భూమిలో పుట్టుదురు. )అని గీతావచనము అట్టి స్వర్గ సుఖముల కంటే శాశ్వతమైన మోక్షమును బుద్దిమంతుడు కోరవలెను .
ఇది స్కాంద పురాణము
No comments:
Post a Comment