చంద్ర వంశము
చంద్ర వంశంలో యయాతి యను రాజు గలడు. అతడు శుక్రుని కూతురు దేవయానిని పెండ్లాడెను .ఆమె వృష పర్వుడను రాక్షస రాజు కూతురును దాసిగా దెచ్చుకొనెను. రాజునకు దేవయాని వలన యదు ,తుర్వసులను కొడుకులు పుట్టిరి .
యయాతి దేవయానికి దెలియకుండ వృష పర్వుని కూతురు శర్మిష్టను పెండ్లాడెను .వారికి ద్రుహ్యుడు ,అనువు , పూరుడు అను కొడుకులు పుట్టిరి .దేవయానికి ఈ సంగతి తెలిసి తండ్రితో చెప్పెను. శుక్రుడు యయాతిని వృద్దుడవు గమ్మని శపించెను యయాతి తన కొడుకులను బిలిచి ముసలితనమును పుచ్చుకుని యౌవనము నిమ్మని యడిగెను. పై నలుగురును తిరస్క రించిరి .కనిష్టు డైన పూరుడు తండ్రికి తన యౌవన మిచ్చి వార్ధక్యమును పుచ్చుకొనెను. యయాతి తన మాట వినని పై నలుగురు కొడుకులను రక రకాలుగా శపించెను . అందులో పెద్దవానిని ,(యదువును ) నీ వంశము వారికి రాజ్యార్హత లేక పోవుగాక యని శపించెను.
యయాతి చాలాకాలము భోగములను భవించి విరక్తుడై ,పూరునకు తిరిగి యౌవన మిచ్చి వార్ధక్యమును తాను గ్రహించి ,తన రాజ్య మాతనికి ఇచ్చెను .పూరుని వంశములోని దుష్యంతుడు శకుంతలను కణ్వాశ్రములలో గాంధర్వ వివాహ మాడి ,ఆమె కుమారుడైన భరతునితో రాగా ,"మనకు సంబంధ మెక్కడిది పొమ్మ " నెను. ఆకాశవాణి చెప్పగా శకుంతలను పత్నిగాను ,భరతుని కొడుకుగాను స్వీకరించెను. భరతుడి తండ్రి తరువాత రాజై భూమండలమును బాలించెను . అతనికి ముగ్గురు భార్యలు . వారు తమకు బుట్టిన కొడుకులను భరతు నంతటి వారు కాలేరని చంపి వేసిరి. భరతుడు బృహస్పతి కొడుకు భరద్వాజుని వితదుడను పేరు పెట్టి తెచ్చి పెంచి రాజ్య మిచ్చెను. ఆ వంశముననే శంతనుడు పుట్టెను .
అతనికి గంగ యందు
భీష్ముడును , సత్యవతి
యందు చిత్రాంగద విచిత్ర వీర్యులును పుట్టిరి.
విచిత్ర వీర్యునికి క్షేత్రజులై వ్యాసుని వలన ద్రుతరాష్ట్రుడు ,పాండు రాజు పుట్టిరి . ద్రుతరాష్ట్రునకు గాంధారి యందు
దుర్యోదనాదులు వందమంది
పుట్టిరి . పాండు రాజునకు కుంతీ మాద్రులందు ధర్మ ,వాయు ,ఇంద్ర , అశ్వినీ దేవతల ప్రసాదమున ధర్మరాజు ,భీమ , అర్జున, నకుల ,సహదేవులను
పుట్టిరి .
No comments:
Post a Comment