Tuesday, December 24, 2013

శ్రీ లింగ పురాణము11






రుద్రాక్ష భేదములు - వాని ఫలములు
పూర్వ మొకప్పుడు త్రిపురుడను రాక్షసుడు లోకాలను బాధించుచుండగా దేవతలు శివునికి మొర పెట్టుకొనిరి. అప్పుడాయన అఘోరాస్త్రమును గూర్చి తీవ్రముగా ఆలోచించుచుండగా ఆయన కన్నుల నుండి నీటి బొట్టులు రాలి భూమి పై బడెను. అవి రుద్రాక్ష వృక్షములకు బీజములయ్యెను.

రుద్రాక్షలు అనేక విధములు ఒక్క ముఖము మొదలు పదునాల్గు ముఖముల దాక రుద్రాక్షలు గలవట. వానివి వరములను ఫలములను ఇట్లుండును :
1. ఏక ముఖము : సాక్షాత్తు రుద్ర స్వరూపము. బ్రహ్మ హత్యనుగూడ పోగొట్టును.
2. ద్విముఖము : ఇది ఉమాశంకర స్వరూపము. మహాపాత కములను పోగొట్టును.
3. త్రిముఖము : అగ్ని స్వరూపము ( త్రేతాగ్నుల రూపము) స్త్రీ హత్యా పాతకమును హరించును.
4. చతుర్ముఖము : బ్రహ్మ స్వరూపము. నర హత్యా పాపమును నివారించును.
5. పంచ ముఖము : కాలాగ్ని రుద్ర స్వరూపము. తిన కూడనివి తినుట, పొంద కూడ నివారిని పొందుట మున్నగు అనేక పాపములను హరించును. ఇది మనకు తేలికగా దొరకును.
6. షణ్ముఖము : కుమార స్వామి స్వరూపము. కుడిచేత ధరించినచో బ్రహ్మహత్యా దోషమును హరించును.
7. సప్త ముఖము : మన్మధ స్వరూపము బంగారము దొంగిలించుట మున్నగు పాపములను హరించును.


First   2  3  4  5  6  7  8  9  10  11  12  13  Last


No comments:

Post a Comment