శ్లో || సహస్ర శీర్ష పురుష పురు హూత సుఖ ప్రద |
యద్భూతం యచ్చ భావ్యం వైత త్రైక: పురుషో భవాన్||
అనుచు స్తోత్రములు చేసెను .తరువాత నృత్య గీత వాద్యములతో మాధవుని సేవించెను. ఆ పిమ్మట మాధవుడొక్కడే మోక్ష దాత యని చేయెత్తి చాటెను. అతని చేయి ఎత్తినట్లే స్తంబించి పోయెను. మాటలు గూడా స్థంబించి పోయెను .అప్పుడు మాధవుడు వచ్చి ,"ఓయి వ్యాపా ! ఎంత తప్పు చేసినావు ?
ఏక ఏవ హి విశ్వేశో ద్వితీయో నాస్తి కశ్చన ,
తత్ప్ర సాదా దహం చక్రీ లక్ష్మీ శస్త త్ప్ర భావతః ||
తైలోక్య రక్షా సామర్ధ్యం దత్తం తే నైవ శంభువా |
ఈ విశ్వమునకు ఈశ్వరుడత డొక్కడే .వేరొకడు లేడు. ఆయన దయ వల్లనే నేను చక్రినైనాను . లక్ష్మీ శుడ నైనాను . త్రైలోక్యమును రక్షించు సామర్ధ్యము అతని వలననే నాకు కలిగినది . నీవు శుభమును గోరినచో శంకరుని స్తుతింపుము" అనగా వ్యాసుడు తన కంటమును తాకు మని సన్న చేసెను .విష్ణువు అట్లు చేయగా నంది వలన స్తంబించిన
వాక్కును ,అంగములను తిరిగి స్వాదీనములోనికి వచ్చెను. అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుని పరి పరి విధముల స్తుతించెను . (వ్యాస కృత శివాష్టకము ,పుణ్య ప్రదము , శివ సాన్నిధ్య కారణము .కాశీ ఖండే 95 అధ్యాయః )
తరువాత వ్యాసుడు , " లింగే ష్వేకో హి విశ్వేష, స్తీర్దే షు మణి కర్ణికా " అని చాటుచూ నిత్యము స్నానము చేసి ముక్తి మండపములో గూర్చుండి శిష్యులకు విశ్వేశుని దివ్య మహిమలును ,వేద పాటములను చెప్పుచు గడుపు చుండెను. ఒకనాడు విశ్వనాధుడు అన్నపూర్ణ తో "వ్యాసునికి బిక్ష దొరక కుండ జేయు " మని చెప్పెను. ఆమె కాశి యందలి సర్వ గృహిణుల హృదయము లయందును ఆవేశించి ,వ్యాసుడును ,శిష్యులను బిక్షకు వచ్చినపుడు ఏదో వంక చెప్పి బిక్ష పెట్టకుండా చేసెను. ఆనాడు శిష్యులతో వ్యాసుడు ఉపవాసము చేసెను .మరునాడు యధాప్రకారముగా బిక్షకు బయలుదేరెను .వ్యాసునకు గాని , శిష్యులకు గాని యే యింటను బిక్ష దొరకలేదు .
వ్యాసుడు శిష్యులతో " మనకు నిన్న ఈనాడు కూడా బిక్ష దొరకక పోవుటకు హేతువు ఏమై యుండును? మిగిలినవారికి లభించు చున్నది కదా ! మనకు మాత్రమే యేల లభింపదు? ఎవరైనా అడ్డు పడినారా ? విచారించి రండ" ని పంపగా వారు వెళ్లి వచ్చి "గురుదేవా ! అందరును క్షేమముగానే యున్నారు.
No comments:
Post a Comment